శాసనమండలిలోకి దేవుడి పటాలు తీసుకెళ్లడమే కాకుండా.. చెప్పులు వేసుకుని దేవుడి పటాలతో ఊరేగింపులు చేశారు. దీంతో ఘోరపచారం చేశారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ తప్పును క ప్పి పుచ్చుకోవడానికి వైసీపీ సభ్యులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అందులో అన్నీ అబద్దాలే. తాము చెప్పులు వేసుకోలేదంటారు. ఆ వీడియోలు బయటకు రావనుకున్నారు.కానీ బయటకు వచ్చే సరికి అవి మార్ఫింగ్ అంటున్నారు. తాము అడిగిన వీడియోలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. వీరి వ్యవహారంతో ప్రజలు వీరు తప్పు చేస్తున్నారని ఇంకా ఇంకా బయటపడుతోంది.
దేవుడిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా, పవిత్రమైన చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ అగౌరవపరచిన వైసీపీ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైఎస్సార్సీపీ ఆత్మరక్షణలో పడింది. మొదట తాము చెప్పులు ధరించలేదని బుకాయించినప్పటికీ, స్పష్టమైన విజువల్స్ బయటకు రావడంతో వారు మాట మార్చుతున్నారు. ఆ వీడియోలు మార్ఫింగ్ అని, తమను బద్నాం చేసేందుకు అధికార పక్షం కుట్ర చేస్తోందని ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే సభలో జరిగిన ప్రత్యక్ష పరిణామాలను గమనించిన మండలి చైర్మన్ కూడా వైసీపీ సభ్యుల తీరు తప్పు అని తేల్చారు.
దేవుడి పటాలను సభలోనే వదిలేసి వెళ్లడం, వాటిని అగౌరవంగా టేబుళ్లపై విసిరేయడం వంటి దృశ్యాలు వారి వాదనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసి తప్పును ఒప్పుకోవాల్సింది పోయి, సాకులు వెతుక్కోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తే నిజం బయటపడుతుందని తెలిసినా, ప్రభుత్వం తమకు కావాల్సిన వీడియోలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం రాజకీయ వివాదంగానే కాకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు వైసీపీ నేతల బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
