అన్యమత ప్రచారంపైనా బీజేపీ ర్యాగింగ్..! నీళ్లు నములుతున్న వైసీపీ..!

తిరుమలలో ఆర్టీసీనే నేరుగా అన్యమత ప్రచారం చేయడం.. రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ముఖ్యనేతలందరూ.. ఈ అంశంపై.. తీవ్రంగా స్పందించారు. ధర్నాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. ముఖ్యమంత్రి జగన్మోహన్ ెడ్డి తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మత మార్పిళ్ల కోసమే.. ఈ తరహా ప్రచారం చేస్తున్నారని..ఆరోపిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయమ… ఏపీలో జరుగుతున్న హిందూ వ్యతిరేక ఘటనలన్నీ..ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతున్నాయా అని ప్రశ్నించారు.

రావాలి ఏసు..కావాలి ఏసు.. వైసీపీ నినాదమా..?

ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ .. సునీల్ ధియోధర్ మరింత ఘాటుగా స్పందించారు. తిరుమల బస్ టికెట్లపై జెరూసలేం యాత్ర ప్రకటన స్వామివారికి అవమానమని మండిపడ్డారు. రావాలి ఏసు, కావాలి ఏసు అనేది వైసీపీ కొత్త నినాదమా..? అని ప్రశ్నించారు. ఏపీలో ఇదే పద్ధతి కొనసాగితే జగన్, కుటుంబసభ్యులను శాశ్వతంగా .. ఏపీ ప్రజలు జెరూసలెంకు పంపుతారని హెచ్చరించారు. ఓ వైపు… తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తూంటే.. వైసీపీ నేతలు… తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేసి..కోపాన్ని చల్లార్చుకుంటున్నారు. టిక్కెట్ల వ్యవహారంపై.. దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… విచారణకు ఆదేశించారు. నెల్లూరు డిపోకు చెందిన టిక్కెట్లు..తిరుమలకు ఎలా వచ్చాయో విచారణ జరిపించాలని ఆదేశించారు. మరో వైపు.. వైసీపీ మంత్రులు.. దీన్ని నేరుగా టీడీపీ అధినేతకు గురి పెట్టారు. చంద్రబాబు హయాంలోనే టిక్కెట్లను ముద్రించారని.. ఇప్పుడు ఉపయోగించారని ఆరోపించారు. ఇదందా.. టీడీపీ, ఆ పార్టీకి మద్దతుగా ఉన్న అధికారుల కుట్ర అని ప్రకటించేశారు. కానీ అదే పనిగా కార్నర్ చేస్తున్న బీజేపీని మాత్రం.. పల్లెత్తు మాట అనలేకపోయారు.

బీజేపీని ఏమీ అనలేక టీడీపీనే విమర్శిస్తున్న వైసీపీ..!

తిరుమలలో ప్రైవేటు వ్యక్తులు అన్యమత ప్రచారం చేస్తే.. తీవ్ర చర్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు.. నేరుగా ఓ ప్రభుత్వ సంస్థనే.. అధికారికంగా అన్యమత ప్రచారం చేసింది. అందుకే.. సర్కార్ మరింత కంగారు పడుతోంది. నేరుగా ప్రభుత్వాధినేతవైపే అందరూ అనుమానంగా చూస్తూండటంతో.. వైసీపీలోనూ కంగారు మొదలైంది. హిందూ రాజకీయాలు… అన్యమత ప్రచారాలపై… తెలుగుదేశం పార్టీ విమర్శలు ఓ స్థాయి వరకే ఉంటాయి. ఈ విషయంలో పేటెంట్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. వారి దూకుడు… స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ… ఆ పార్టీని వైసీపీ నేతలు ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. మత రాజకీయాలు చేసినా..కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే.. వైసీపీ నేతలు.. టీడీపీపై ఆరోపణలు చేసి..కవర్ చేసుకుంటున్నారు.

వైసీపీ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న బీజే్పీ..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి… రాజకీయాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు పదే దే వివాదాస్పదమవుతోంది. గతంలో ఎప్పుడూ పెద్దగా ప్రచారంలోకి రాని మత మార్పిడుల అంశం… తెరపైకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ అన్యమతం… అని వినిపించినా.. ఎక్కడ హిందూ సంప్రదాయాల ఉల్లంఘన అని..కనిపించినా.. బీజేపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఉన్న క్రిస్టియన్ నేపధ్యం బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com