ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రజలకు సాయం చేసే విషయంలో, వారికి అందుబాటులో ఉండే విషయంలో ప్రత్యేకత చూపిస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్లో ఆయన టీములు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా సాయం కోరిన సామాన్యులకు ఆయన టీం మెరుపు వేగంతో స్పందిస్తూ అండగా నిలుస్తోంది. అనారోగ్య సమస్యలు, ఫీజుల చెల్లింపులు, అత్యవసర వైద్య సాయం వంటి విషయాల్లో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా లోకేష్ స్పందిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ సానుకూలతను జీర్ణించుకోలేని వైసీపీ, సాంకేతిక అంశాలను సాకుగా చూపి ఆ సాయంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది.
సాయం పొందిన వారి డీటైల్స్ పబ్లిక్ డొమైన్లో
లోకేష్ టీం ద్వారా సాయం పొందిన కొందరి ట్విట్టర్ అకౌంట్లు అన్యాక్టివ్గా ఉండటం లేదా డీయాక్టివేట్ అవ్వడాన్ని పట్టుకుని, వైకాపా సోషల్ మీడియా విభాగాలు అది ఫేక్ సాయం ‘ అంటూ ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి, సాయం పొందిన వ్యక్తుల వివరాలు, వారు చికిత్స పొందిన ఆస్పత్రుల రికార్డులు పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. సాయం అడిగిన సమయంలో ఉన్న స్క్రీన్ షాట్లు, తదనంతరం వారు కోలుకున్న వీడియోలు సాక్ష్యంగా నిలుస్తున్నా, కేవలం అకౌంట్ లేదనే కుంటి సాకుతో ఈ సాయాన్ని కించపరచడం వారి నైజానికి నిదర్శనంగా మారుతోంది.
సొంత పార్టీ వారికి రూపాయి సాయం చేయలేని మూక ఇది!
వైసీపీ విమర్శల వెనుక ఉన్న అసలు కారణం వారి పార్టీలోని ఘోరమైన పరిస్థితులే. సొంత పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోని చరిత్ర ఆ పార్టీది. బూతుల కోసం వాడుకున్న కృష్ణారెడ్డి అనే కార్యకర్త చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు పార్టీ అధినేత కానీ, ఇతర నేతలు కానీ రూపాయి సాయం చేయలేదు. చివరికి గో ఫండ్ మీ ద్వారా సాయం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడినా, అవసరమైన ఖర్చులకు నిధులు అందలేదు. సొంత మనుషుల ప్రాణాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చే వారు, పక్క పార్టీ నేత చేస్తున్న సాయాన్ని చూసి ఓర్వలేక పోవడంలో ఆశ్చర్యం లేదన్న విమర్శలు సాధారణ ప్రజల నుంచి వస్తున్నాయి.
సాయం పొందిన వారి ఆశీస్సులు చాలు
నిజానికి సాయం పొందిన బాధితులకు ఆ విలువేంటో తెలుస్తుంది. రాజకీయ లబ్ధి కోసం చేసే విమర్శలు ఆగిపోవచ్చు కానీ, ఆపదలో అందిన సాయం పచ్చని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సాయం చేసే చేతులను విమర్శించడం కంటే, ఆపదలో ఉన్న తమ సొంత కార్యకర్తలను ఆదుకోవడంపై వైసీపీ దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. లోకేష్ సాయం ఫేక్ అని నిరూపించే తాపత్రయంలో వైసీపీ పడుతున్న పాట్లు, వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతున్నాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకనే..,దాన్ని తీసుకునే ప్రయత్నం ఎప్పుడూ వైసీపీ నేతలు చేయరు.
