వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత మంది సోషల్ మీడియా కార్యకర్తలను డబ్బులు ఆశ చూపించి సైకోలుగా మారుస్తోందన్నది పచ్చి నిజం. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. అందర్నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టి జైలుకు వెళ్తే ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలా చాలా మంది ఆవేశపడి జైళ్లకు వెళ్లారు. వారు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత చెక్కులిస్తున్నారు. ఇదంతా గుట్టుగా సాగుతోంది.అయితే ఇప్పుడు ఆ ఆర్థిక సాయం విషయంలో కులాల తేడాలు చూపించడంతో కొంత మంది తెరపైకి వచ్చి అసలు విషయాలు బయటపెడుతున్నారు.
బూతు పోస్టులు పెట్టి జైలుకెళ్తే లక్ష
సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, ఫేక్ ప్రచారాలు చేసి జైలుకు వెళ్లిన వారికి వైసీపీ నాయకత్వం రూ. లక్ష చెక్కులు ఇస్తోంది. ఆ చెక్కులను చాలా మందికి ఇచ్చారు. దాదాపుగా వంద మందికి ఇచ్చారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అరెస్టులు అయినప్పుడు.. విడుదల తర్వాత .. కుదిరినప్పుడు జగన్ తాడేపల్లికి వచ్చిన సమయంలో ఓ సారి ఆయన వద్దకు తీసుకెళ్తారు. ఓ చెక్కు ఇప్పిస్తారు. ఆ చెక్కు వైసీపీ పార్టీ పేరు మీద ఉండదు. ఎవరో లీడర్ లేదా.. మరో పేరు మీద ఉంటుంది. కానీ అది క్లియర్ కాదు. ఇలా వంద మందికి చెక్కులు ఇస్తే యాభై మందికి క్లియర్ కాలేదు. మిగతా యాభై మందికి అయ్యాయి. ఆ యాభై మంది రెడ్లు అని.. క్లియర్ కాని క్యాడర్ అంటున్నారు. తము రెడ్లు కాదు కాబట్టే దొంగ చెక్కులిచ్చారని ఫీలవుతున్నారు.
సగం మందికి అసలు చెక్కులు.. సగం మందికి ఫేక్ చెక్కులు
జైలుకుపోయి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. వారిలో చాలా మంది చిరుద్యోగాలు చేసుకుంటున్నారు. కేసులు నమోదు కావడం…వారి సైకోతనం ఏమిటో బయటపడటం బయట వారిని హీనంగా చూస్తున్నారు. ఉద్యోగాల నుంచి తీసేశారు. వారికి ఉపాధి లేకుండా పోయింది. కొంత మంది రెడ్డి సామాజికవర్గం వారికి పార్టీ ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చారని.. మిగతా వారిని గాలికొదిలేశారని చెబుతున్నారు. వైసీపీ నాయకత్వాన్ని నమ్ముకుని సైకో పనులు చేస్తే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారు.
వాళ్ల జీవితాలను నాశనం చేసి జగన్ కోసం రాజకీయ బాట
అసలు ఇలా సైకోల్లా వ్యవహరిస్తే..తప్పుడు పోస్టులు, ఫేక్ పోస్టులు, బూతులు తిట్టించి డబ్బులు ఇవ్వడం అనే కాన్సెప్ట్ లోనే వారి నిర్వాకం, ఆలోచన స్థాయి ఏంటో క్లారిటీ వస్తుంది. జగన్ పై అభిమానమో.. మతాభిమానంతోనో ఇలా వైసీపీ ట్రాప్ లో పడిన వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు కేసుల పాలై తీవ్ర మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడంలో రాటుదేలిపోయిన జగన్ ఇవేమీ పట్టించుకోవడంలేదు. వారంతా తన కోసం పుట్టిన సమిధలని అనుకుంటున్నారు.
