జ‌గ‌న్ కి రాజ‌కీయాలే త‌ప్ప‌, ప్ర‌యోజ‌నాలు క‌నిపించ‌వేమో..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెళ్లొచ్చారు! ఇదే అంశంపై ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. సాక్షి ప‌త్రిక‌లో ఆయ‌న పాద‌యాత్ర డైరీ అని ప్ర‌తీరోజూ ఏదో ఒక‌టి రాస్తుంటారు క‌దా. 323వ రోజు డైరీలో ఇదే అంశ‌మై ముఖ్య‌మంత్రి మీద విమ‌ర్శ‌లు చేశారు. పెథాయ్ తుఫాను ప్ర‌భావంతో గాలులు వీస్తూ, వ‌ర్షం ప‌డుతుంటే… ఆ చినుకుల మ‌ధ్య‌లోంచి త‌న పాద‌యాత్ర సాగింద‌ని జ‌గ‌న్ అన్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి గ‌త తుఫానులు గుర్తొచ్చాయ‌నీ, ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు గుర్తొచ్చి తీవ్ర ఆందోళ‌న కలిగింద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ వైఫ‌ల్యాల నుంచి ఈ ప్ర‌భుత్వం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింద‌న్నారు!

వ‌ర్షం అధికం కావ‌డంతో ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తన పాద‌యాత్ర‌ను అర్థంత‌రంగా ముగించాల్సి వ‌చ్చింద‌న్నారు. తుఫాను ప్ర‌భావంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురై, బిక్కుబిక్కుమంటూ ఉంటే… స‌హాయ‌క చ‌ర్య‌ల్ని అనుక్ష‌ణం ప‌ర్య‌వేక్షించాల్సిన ముఖ్య‌మంత్రి, ఇత‌ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా జ‌రిగే ‘సంబ‌రాల్లో’ పాల్గొన‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని ప్ర‌శ్నించారు? రాష్ట్ర ప్ర‌జ‌ల క‌న్నా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే మీకు ముఖ్య‌మా అంటూ నిల‌దీశారు. అయితే, ఈ డైరీలో.. తాను పాద‌యాత్ర‌ను అర్ధంత‌రంగా ఆపేయ‌డ‌మే ప్ర‌జా ప్ర‌యోజ‌నకర చ‌ర్య‌గా గొప్ప‌గా రాసుకోవ‌డం విశేషం!

ప్ర‌తీదానికీ రాజ‌కీయంతో లింక్ పెట్ట‌డ‌మే వైకాపా చేస్తుంది. వాస్తవానికి తుఫాను స‌హాయ చ‌ర్య‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇంకోటి, కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల ప్ర‌మాణ స్వీకారాల సంబ‌రాల‌కు సీఎం వెళ్లారు, ఏదో హాలీడే ట్రిప్ కి వెళ్లార‌నే అర్థం ధ్వ‌నించేలా జ‌గ‌న్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఆలోచిస్తే.. అది కూడా అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మ‌మే క‌దా. వ‌చ్చే లోక్ సభ ఎన్నిక‌ల త‌రువాత ఏపీకి న్యాయం చేసే ప్ర‌భుత్వం కేంద్రంలో ఏర్ప‌డాల్సి ఉంది. దానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో భాజ‌పాయేత‌ర రాజకీయ కూట‌మి క‌ట్టే ఏర్పాట్లలో చంద్ర‌బాబు నాయుడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో జ‌రిగే స‌మావేశాలు చాలా కీల‌క‌మైన‌వి. అవేవో సొంత ప్ర‌యోజ‌నాల కోసం జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు కావు. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ ల‌కు చంద్ర‌బాబు వెళ్లారు. అంతేగానీ, రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే… ఆయ‌నేదో హాలీడే ట్రిప్ కి వెళ్లార‌న్న‌ట్టుగా జ‌గ‌న్ ప్రొజెక్ట్ చేస్తున్న ప‌రిస్థితి వాస్త‌వంలో లేదు. తుఫాన్ సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాలు అనే కోణమే మాట్లాడుతుంటే ఏమనుకోవాలి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close