వైసీపీ కాపు నేతలు పవన్ కల్యాణ్ ఎక్కడ సీఎం అయిపోతారోనని కంగారు పడిపోతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ది కోసం ఏమైనా చేయవచ్చని.. చంద్రబాబు కేంద్ర రాజకీయాలకు వెళ్తే.. పెద్ద కులానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందని.. పవన్ ను సీఎం చేయవచ్చని బొత్స అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
పవన్ సీఎం అయితే ఒక పెద్ద సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని చంద్రబాబు భావించవచ్చు అన్నారు. అంతటితో అగలేదు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏదైనా చేస్తారు అని వ్యాఖ్యానించారు. అంటే .. పవన్ సీఎం అయితే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే చాన్స్ ఇస్తారన్నట్లుగా బొత్స మాట్లాడుతున్నారు. అసలు అలాంటి ఆలోచన వస్తే నిజం కాపులకు అవకాశం లభించినందుకు బొత్స సంతోషపడాలి కానీ..రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్తున్నారన్నట్లుగా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇతర వైసీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు వంటి వారుకూడా.. పవన్ ఎక్కడ సీఎం అయిపోతారోనని నెగెటివ్ గా మాట్లాడటం మీడియా ప్రతినిధుల్ని కూడా ఆశ్చ్య పరిచింది. అయితే తర్వాత తాము పవన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని .. గుర్తించి సర్దుకున్న బొత్స.. అలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేసి.. తనదైన స్టైల్లో నవ్వారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని, జమిలి ఎన్నికల ప్రచారం కారణమంగా సమీకరణాలు మారవచ్చని అయన భావిస్తున్నారు.
