ప్రతీ దానికి తానున్నానని వీడియోలు రిలీజ్ చేయడమో. . రోజుకు రెండు , మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టడమో ఇటీవలి కాలం లో చేస్తున్న రోజా ఇప్పుడు బయట కనిపించడం లేదు. తనకు శత్రువు లాంటి కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేస్తే బయటకు రాలేదు. చిరంజీవి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాక్షి మీడియా రోత రోతగా రాస్తున్నా ఆమె మాట్లాడేందుకు ముందుకు రాలేదు. ఇంతకూ రోజాకు ఏమైంది? ఎందుకు రావడం లేదు ?
నగరి నుంచి మరో నేతను చూసుకున్న జగన్
నగరి నియోజకవర్గం నుంచి జగన్ మరో లీడర్ ను చూసుకున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకుని నగరి బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన రోజా పైర్ అయ్యారు. నగరి నుంచి తనను దూరం చేసేలా.. జగదీష్ ను పార్టీలో చేర్చుకుంటే ఏం జరుగుతుందో చూస్తారని హెచ్చరికలు పంపారు. దాంతో జగన్ జగదీష్ ను పిలిపించి.. చేరికను వాయిదా వేసుకోవాలని సూచించారు. రోజాను సర్దిచెప్పిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామన్నారు.
రగిలిపోతున్న రోజా !
/
చిత్తూరులో కేవలం పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆయన కుమారుడు ఎంపీగా గెలిచాడు. కానీ ఇంకెవరూ గెలవలేదు. అందరూ ఓడిపోయారు. దీనికి కారణం పెద్దిరెడ్డి అనే ఆరోపణలు రోజా చేస్తున్నారు. అందుకే జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో తొలగించారు. భూమనకు చాన్స్ ఇవ్వడంతో రోజా రోజూ వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు కిరణ్ రాయల్ ఇష్యూ వచ్చినా.. ఇంకో ఇష్యూ వచ్చినా మాట్లాడటం లేదు.ల
రోజాకు బదులు శ్యామలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్
రోజా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. ఆమెకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టే బాధ్యతల్ని ఇవ్వడం లేదు. హైదరాబాద్ నుంచి యాంకర్ శ్యామలను రప్పించి ప్రెస్మీట్ పెట్టిస్తున్నారు. మెల్లగా పార్టీలో మాట్లాడేందుకు కూడా శ్యామలను ప్రత్యామ్నాయ చేసుకుంటున్నారు. అటు నగరి నియోజకవర్గంలో..ఇటు. పార్టీలో మాట్లాడేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకుని రోజాను జగన్ పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయం అర్థమైన రోజా సైలెంటయ్యారు. ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు.