అంబటి రాంబాబు తనను అరెస్టు చేయాలని బతిమాలుకున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి అదే పని. పోలీసులు కూడా అరెస్టు చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఆయనను బయటకు తీసుకు వస్తే దాడుల చేస్తారని.. కాపాడటం కష్టం అన్న ఉద్దేశంతో ఆలస్యం చేశారు. చివరికి అర్థరాత్రి సమయంలో.. అరెస్టు చేశారు. ఆయనపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేయడానికి జనం ఉండటంతో కాపాడేందుకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఆయన అసలు కనిపించకుండా.. వజ్ర వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.
చంద్రబాబు, ఆయన తల్లిపై అత్యంత హీనమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుకు సెగ గట్టిగానే తగిలింది. తీవ్ర నిరసనలు ఎదురుకావడంతో ఏ క్షణం తనపై దాడి జరుగుతుందోనని తనను అరెస్టు చేసి తీసుకెళ్లిపోవాలని పోలీసుల్ని కోరారు. ప్రెస్మీట్ పెట్టి అరెస్టు అవడానికి సిద్ధమయ్యారు. ఆయన మరింత రెచ్చగొట్టడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. పోలీసులు కంట్రోల్ చేసినా.. అంబటి రాంబాబు ఇంట్లోకి దూసుకెళ్లారు. బిక్కుబిక్కుమంటూ ఓ గదిలో కొంత మంది పార్టీ నేతలతో కలిసి దాక్కున్న ఆయన… అరెస్టు కోసం పోలీసుల్ని పదే పదే బతిమాలుకున్నారు.
నిజానికి పోలీసులు అరెస్టు చేయకపోతే ఆయన పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేది. బయట కనిపిస్తే చెప్పుల దాడులు, కోడిగుడ్లు, టమాటాల దాడులు జరగడం ఖాయంగా కనిపించింది. పోలీసులు తీసుకెళ్తూంటేనే వదిలి పెట్టలేదు. ఘోరమైన మాటలు మాట్లాడి.. కులాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసినా .. అది కూడా రివర్స్ అయింది. తప్పులు చేసి కులాన్ని నిందించేలా చేస్తావా అని అందరూ మండిపడ్డారు.
సాధారణగా… బూతులు మాట్లాడినప్పుడు ప్రజల్లో ఇంత స్పందన రావడం ఇప్పుడే. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బూతులు కామన్ అయిపోయాయి. కానీ గత ఏడాదిన్నరగా రాజకీయాలు స్వచ్చంగా ఉంటున్నాయి. ఎవరైనా బూతులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకు వచ్చారు. కానీ మా ఇంట్లో కుక్క కూడా భయపడదంటూ అంబటి రాంబాబు లాంటి వాళ్లు పరిధి దాటిపోతున్నారు. ఆయనకు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నారు.
