వైసీపీ యువనేతల్లో జగన్ రెడ్డికి బాగా ఇష్టమైన లీడర్ నాగార్జున యాదవ్. వైసీపీ అధికారం పోయిన మొదట్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ప్రయత్నం చేసి అరెస్టు అవడంతో.. తర్వాత స్పీడ్ తగ్గించారు. కానీ ఆయన గ్రౌండ్ లో మాత్రం వైసీపీ బ్రాండ్ ను కొనసాగించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
సత్తెనపల్లిలో ఓ హోటల్ కు తినడానికి వెళ్లారు. అక్కడ సర్వింగ్ ఆలస్యం అయిందని సిబ్బందిపై దాడి చేసి కొట్టారు. ఆ హోటల్ యజమాని వస్తే ఆయనపైనా దాడి చేశారు. మాకు ఎదురు తరిగితే మేము ఇంతే చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారట. ఇది పెద్ద వార్నింగే అనుకుని వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు పెట్టారు.
కేసులు పెట్టించుకుంటేనే వైసీపీలో విలువ ఉంటుందని నాగార్జున యాదవ్ లాంటి నేతలు అనుకుంటున్నారు. అందుకే చిల్లర పనులు చేసి కేసుల పాలవుతున్నారు. టిఫిన్ సెంటర్ పై దాడి చేయడం కన్నా చిల్లర పని ఏముంటుందని .. అది లీడర్ల లక్షణం కాదని ఆయనకు అర్థం కాలేదు. కీచుగొంతుతో చేసే ప్రసంగాల ఎఫెక్ట్ వల్ల పోయే ఇమేజ్‌కు తోడు.. ఇలాంటి కేసులతో మరింత నవ్వుల పాలవుతున్నారు.