సొంత తల్లిపై తప్పుడు ప్రచారం చేయించడానికి ఏ మాత్రం వెనుకాడని జగన్ రెడ్డి .. ఆ పేరు మాత్రం తనపై రాకూడదన్నట్లుగా వింత ప్రయత్నాలు చేస్తూంటారు. తల్లి విజయమ్మ ఎన్సీఎల్టీలో అఫిడవిట్ దాఖలు చేశారు. దానిపై వైసీపీ నేత రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రెస్మీట్ పెట్టారు.ఆ ప్రెస్మీట్లో ఏం మాట్లాడాలో సాక్షి నుంచి ఆయనకు కంటెంట్ వెళ్లింది. అదే మాట్లాడారు. లేకపోతే ఆయనకు జగన్ తల్లి మీద కామెంట్స్ చేసేంత ధైర్యం ఉండదు.
ఆయన మాట్లాడిన మాట్లాడిన మాటల్ని విపులంగా పేజీ నిండా అచ్చేశారు. ఆ మాటలన్నీ జగన్ తల్లిని నానా మాటలన్నవే. ఆమె చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారట. సొంతతల్లిపై ఇలాంటి అభాండాలు వేసే కొడుకు ఉంటాడని ఎవరూ అనుకోలేరు. తల్లి, చెల్లికి ఆస్తులు ఎగ్గొట్టి.. వారిపై కేసు వేసింది జగన్ రెడ్డి. ఆ కేసులో భాగంగా విజయమ్మ అఫిడవిట్ వేస్తే దాన్ని చంద్రబాబుకు అంటగట్టి.. తల్లిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తాను అన్నట్లుగా కాకుండా పార్టీ నేతలు అన్నట్లుగా ప్రెస్మీట్లు పెట్టించి మరీ ప్రచారం చేయిస్తున్నారు.
తల్లి, చెల్లి చంద్రబాబు మాయలో ఉన్నారని జగన్ నేరుగా విమర్శలు చేస్తే కాస్త నిజాయితీ ఉంటుంది. కానీ అలా చేయకుండా పార్టీ నేతలతో మాట్లాడించి .. సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున అచ్చేయడం ఘోరమైన విషయం. కనిపెంచిన తల్లి విషయంలో జగన్ వ్యవహరిస్తారని ఎవరూ కలలో కూడా అనుకోలేరు. కానీ జగన్ అలాంటి వాటికి విరుద్ధం.


