తాము క్రూరులం, హంతకులం, ఖూనీకోరులం.. మళ్లీ మాకు అధికారం వస్తే ఏం చేస్తామో తెలుసుగా అని బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు.. వారి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన వికృతాలు చేశారు. ఘోరాలు చేశారు..నేరాలు చేశారు. దోపిడీలు చేశారు..దోచుకున్నారు. అంతా చేశారు. ఇప్పుడు చట్టం చేతికి చిక్కారు. చట్టం చర్యలు తీసుకోకుండా.. మళ్లీ వస్తే మేం అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పిట్ట బెదిరింపులకు చట్టాలు భయపడతాయా?
జగన్ రెడ్డినే ఇప్పుడు తన అక్రమాస్తల కేసుల్లో ఎప్పుడు జైలుకు వెళ్తానా అని కిందా మీదా పడి వణికిపోతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాల్లో ఆయనకూ వాటా ఉంది. గాలి జనార్ధనా రెడ్డి చేసిన మైనింగ్ డబ్బులు రెడ్ గోల్డ్ అనే కంపెనీ ద్వారా జగన్ రెడ్డి కంపెనీల్లోకి వచ్చాయి. సజ్జలకు, జగన్ కు అనుబంధం పెరగడానికి గాలి జనార్ధన్ రెడ్డినే కారణం. ఆ కేసులో వారు తప్పించుకుని ఉండవచ్చు కానీ అక్రమాస్తుల కేసుల్లో ఎలా బయటపడతారు?. ఈ విషయం జగన్ రెడ్డికీ అర్థమైంది కాబట్టి కాళ్లు పట్టుకోవడానికి మాస్టర్ క్లాస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఓ వైపు జగన్ రెడ్డినే అలా ఉంటే.. కింది స్థాయి పిల్ల , చిచ్చి చేష్టల వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం.. మళ్లీ వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని రెచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎవర్ని బెదిరిస్తున్నారో వారు అధికారంలో ఉన్నారన్న సంగతిని మరచిపోతున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా.. చట్ట పరిధిలోనే చేయాలి. తేడా వస్తే.. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితే వస్తుంది.