పులివెందులలో తమను కొట్టారని వైసీపీ ఎమ్మెల్సీతో పాటు మరికొంత మంది నేతలు చేసుకుంటున్న ప్రచారం వైసీపీ దుస్థితిని బయట పెడుతోంది. తమను కొట్టారని చెబుతోంది ఎక్కడో కాదు.. పులివెందులలో. పులివెందులలో ఇప్పటి వరకూ ఎవరైనా కొట్టారు..దాడి చేశారు అంటే.. అది ఇతరులపైనే . రాళ్లేసినా.. గుడ్లేసినా ఇతర పార్టీల అగ్రనేతలకైనా ఆ పరిస్థితి ఉంటుంది కానీ వైసీపీ లోకల్ లీడర్ పై కూడా దాడి చేశారన్న ప్రచారం ఇంత వరకూ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం చుట్టూ అలాంటి కోట వైఎస్ కుటుంబం కట్టుకుంది.
ఇప్పుడు జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారంలో తమను కొట్టారని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఆ పార్టీ కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకూ ఇచ్చుకున్న ఎలివేషన్లు ఏంటి.. ఇప్పుడు చేస్తున్న డ్రామాలేంటని వారు ఉస్సూరుమంటున్నారు. దాడి చేసిన దృశ్యాలు లేవు. కేవలం కార్ల అద్దాలు పగిలిన దృశ్యాలు ఉన్నాయి. రాళ్లు కూడా కనిపించలేదు. పైగా ఆ ఎమ్మెల్యే రమేష్ .. ఆస్పత్రిలో ఆడిన నాటకం దృశ్యాలు ట్రోల్ కు గురవుతున్నాయి. అసలు దాడి చేసిన వారు ఎవరో తెలియకుండా.. ఏమీ గాయపడకుండా.. కార్ల అద్దాలు పగుల గొట్టుకుని డ్రామాలాడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఒక వేళ నిజంగా దాడి చేసి ఉంటే.. పులివెందుల నియోజకవర్గంలో.. అదీ పులివెందుల మండలంలో వైసీపీ నేతలు తన్నించుకున్నారంటే.. ఇక జగన్ రెడ్డి పోగొట్టుకోవడానికి ఏమీ మిగలనట్లే అనుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి డ్రామాలు ఆడటం కన్నా.. నిజాయితీగా పోటీ చేసి..స్వేచ్చగా ప్రజలు ఓట్లేస్తే గెలవడం అనేదే ఎక్కువగా నిలబడి ఉంటుంది. ఇప్పటి వరకూ పులివెందులలో ఎప్పుడైనా స్వేచ్చగా ఎన్నికలు జరిగాయని అనుకోరు. కానీ ఇప్పుడు కూడా అలా జరగకూడదని కోరుకుంటున్నారు. అందు కోసమే గొడవల డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.