నా ఎదవతనంతో పోలిస్తే ని ఎదవతనం ఎంత ? .. అని .. తండ్రి కోట..తనయుడు శ్రీహరితో ఓ సినిమాలో పదే పదే చెబుతూంటాడు. వైసీపీ నేతలకు ఇప్పుడు అలాంటి సందేశాలే వస్తున్నాయి. జైలుకెళ్లాల్సి వస్తోందని ఎవరూ బాధపడవద్దని.. జైలుకెళ్లిన జగన్ సీఎం అయ్యారని.. గుర్తు చేస్తున్నారు. జైలుకు పంపినా మహా అయితే రెండు, మూడు నెలలు జైల్లో పెట్టగలరని.. అంత కంటే ఏమీ చేయలేరని అంటున్నారు. జగన్ కూడా ఇవే మాటలు చెబుతున్నారు.ల వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కానీ.. జైలుకెళ్లడం పరువు తక్కువ అనుకోవడం లేదు. ఇంత కాలం సమకూర్చుకున్న పేరు ప్రతిష్టలేం కావాలన్న విషయాలను పట్టించుకోవడంలేదని లేదు.
అరెస్టు అవుతున్న ఒక్కరైనా తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటారా ?
కక్షసాధింపుల కారణంగా అక్రమ కేసులతో జైలుకు పంపితే ప్రజల్లో సానుభూతి వస్తుంది. కానీ ఇప్పుడు వైసీపీ నేతలపై ప్రజల్లో అలాంటి భావన ఉందా లేదా అన్నది చూసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ వైసీపీ నేతలు చాలా మంది అరెస్టు అయ్యారు. వారిలో ఎవరిని అయినా కక్ష పూరితంగా అరెస్టు చేశారని ప్రజల్లో కానీ వైసీపీ క్యాడర్ లో కానీ అనిపించిందా ?. కనీస సానుభూతి వచ్చిందా?. ఇంకా ఎందుకంత ఆలస్యం అన్న అభిప్రాయం వినిపించింది. వల్లభనేని వంశీపై వరుసగా కేసులు పెట్టి బయటకు రాకుండా చేస్తున్నారు. అతనికి అది కరెక్టే అన్న అభిప్రాయమే ఎక్కువ అవుతోంది కానీ.. సానుభూతి రావడంలేదు.
గౌరవనీయమైన బతుకు బతికీ జైలుకెళ్లడం సాధారణం అవుతుందా?
జగన్ రెడ్డిని నమ్ముకుని పెద్ద ఎత్తున నేతుల జైలుకు వెళ్తున్నారు. అందరూ తప్పులు చేసి వెళ్తున్నారనే అనుకుంటున్నారు కానీ. .. ఫలానా వారిపై కక్ష సాధింపుల కోసం కేసులు పెట్టారని ఎవరూ అనుకోవడం లేదు. చివరికి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను కూడా జైలుకు పంపారు. వారికి ఆది కరెక్టేనని వైసీపీలోనే చాలా మంది అంటున్నారు. వారిని అలా వదిలి పెట్టవద్దని.. పార్టీ అండగా ఉందని చెప్పించడానికి.. గుంటూరు, కృష్ణ నేతల్ని హైకమాండ్ ఆయన వద్దకు పంపింది. కానీ వారు బతికిన బతుకేంది.. ఇప్పుడు జైల్లో కూర్చోవడం ఏంది ?. మూడు నెలలు లోపలుండి బయటకు వస్తారు అంతా బాగుంటుందని తర్వాత అనుకోలేరుగా.!
పావులుగా వాడుకుని బలి చేసి.. నాతో పోలిస్తే అనే కబుర్లు చెబుతున్న జగన్ !
జగన్ రెడ్డి అందరి పరువులతో ఆడుకుంటారు. తన కోసం వారిని ఉపయోగించుకుని వారిని నిర్వీర్యం చేసి.. వారిని పావులుగా చేసి తాను అక్రమ సంపాదనకు పాల్పడి.. అందర్నీ జైలుకు పంపుతారు. వారికి అంతో ఇంతో కమిషన్ ఇస్తారు. తర్వాత జైలుకెళ్లే పరిస్థితులు ఉంటాయి కాబట్టే ఆ కమిషన్. ఆ విషయం ఆయన పాలబడిన వారికి ..జైలుకెళ్లే ముందే అర్థమవుతుంది. జగన్ రెడ్డి దెబ్బకు ఎన్ని కుటుంబాలు మానసికంగా వేదన పడుతున్నాయో చెప్పాల్సిన పని లేదు.