బాలకృష్ణకు కష్టం లేకుండా చేస్తున్న హిందూపురం వైసీపీ నేతలు..!

హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ… ఆ నియోజకవర్గానికి తక్కువ సమయమే కేటాయిస్తున్నారు. తన పీఏల్ని ఇతరుల్ని పెట్టుకుని బండి నడిపిస్తూంటారు. అలాంటి సందర్భంలో వైసీపీ నేతలు… దూకుడుగా వ్యవహరించి.. ప్రజలకు మేలు చేసి.. బాలకృష్ణకు ఓటర్లను దూరం చేయాలి. కానీ విచిత్రంగా హిందూపురం నేతలు ప్రజల్ని పట్టించుకోకుండా.. వారికి వారు ఘర్షణలకు దిగి.. బాలకృష్ణకు మరింత మైలేజీ ఇస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవలేదు. ఎప్పుడూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

అయితే టీడీపీ అధికారంలో లేకపోతే.. అక్కడ ఉండే ప్రతిపక్ష పార్టీ ఇంచార్జులే పెత్తనం చేస్తారు. ఇప్పుడు వైసీపీ ఇంచార్జులకు ఆ చాన్స్ వచ్చింది. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం మొత్తం వైసీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట వినే అధికారుల్ని ఎప్పటికప్పుడు బదిలీ చేసేస్తున్నారు. ఎనిమిది మంది మున్సిపల్ కమిషనర్లను మార్చారని బాలకృష్ణ ఫైరవడం దీనికి సాక్ష్యం. అయితే అటు ఎమ్మెల్యేను మంచి చేయనివ్వడం లేదు.. చివరికి వారు కూడా చేయలేకపోతున్నారు. వర్గ పోరాటంలో మునిగి తేలుతున్నారు.

హిందూపురం వైసీపీలో మొదటి నుంచి నవీన్ నిశ్చల్ అనే నాయకుడు ఉండేవారు. ఆయనను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని జగన్ పార్టీలో చేర్చుకున్నారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. పార్టీలో చేర్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌కు ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలో అర్థం కాక హిందూపురంలో సర్దుబాటు చేశారు. దీంతో కొత్త వర్గం తయారైనట్లయింది. ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉన్న వర్గాలకు తోడు ఇక్బాల్ వర్గం కూడా.. ఇప్పుడు చురుగ్గా ఉంది. హిందూపురంలో వైసీపీ కార్యకర్తలందరూ రెండు రకాలుగా విడిపోయారు. కొంత మంది ఇక్బాల్ వైపు.. మరికొంత మంది నవీన్ నిశ్చల్ వైపు చేరిపోయారు.

రెండు వర్గాలు ప్రజలకు మేలు చేయడం సంగతేమో కానీ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాల్లో ఆరోపణలు చేసుకోవడానికి ఫుల్ టైం కేటాయిస్తున్నారు. దీంతో పోలీసులు మాజీ పోలీసు అధికారి అయిన ఇక్బాల్ వర్గానికే వత్తాసు పలుకుతున్నారు. దీంతో నవీన్ నిశ్చల్ ఫీలవుతున్నారు. ఈ గొడవల్లో.. బాలకృష్ణ మనుషులు.. టీడీపీ నేతలు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల మైలేజీ… వైసీపీ ఖాతాలో కాకుండా.. తమ ఖాతాలో పడేలా చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close