వైసీపీ నేతలు తాళ్లు తెచ్చుకున్న జంతువుల మాదిరిగా రెచ్చిపోతున్నారు. పేర్ని నాని దగ్గర నుంచి ఉప్పాల హారిక అనే మహిళా నేత వరకూ ఎవరూ తగ్గడం లేదు. అదేదో ఊతపదంలా నరికేస్తామని అంటున్నారు. పేర్ని నాని లాంటి వాళ్లు అలా అనకూడదు.. వివేకాను చంపేసినట్లుగా చీకట్లో చంపేసి..సైలెంట్‌గా పొద్దున్నే వెళ్లి పరామర్శించాలని బహిరంగంగానే సలహాలు ఇస్తున్నారు. వారి మానసిక స్థితి చూసి చాలా మందికి విరక్తి వచ్చేస్తోంది. ఇంతా చేస్తున్నా వారిని ఎందుకు పోలీసులు పట్టించుకోవడంలేదన్న డౌట్ చాలా మందికి వస్తోంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటే మరింత రెచ్చిపోయి…తన్నించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే తన్నించుకున్నా పర్వాలేదు.. సానుభూతి వస్తుందని వారు ఆశపడుతున్నారు.
రెచ్చగొట్టి తన్నించుకోవాలన్న ప్లాన్ లో వైసీపీ నేతలు
గుడివాడకు సంబంధం లేని పెడనకు చెందిన ఉప్పాల హారిక , ఉప్పాల రాము అనే వైసీపీ నేతల్ని పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకుంటే ల.. భాష వాడేశారు. ఆ మహిళ ఆ తిట్లు పోలీసుల్ని తిట్టినట్లుగా లేవని.. తనను తానే తిట్టుకున్నట్లుగా ఉందని కూడా అనుకోలేదు. నోరు పారేసుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చేసిన నాటకాలు చూసి.. ఆ వీడియోను వైసీపీ నేతలు వైరల్ చేసిన వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో పేర్ని నాని ఫోన్లో ఈ డ్రామా అంతా ఎలా పండించాలో వెసిన స్కెచ్ వెలుగులోకి వచ్చింది. ఏది చేసినా దొరికిపోవడం వారి స్టైల్ అన్నట్లుగా ఇలాంటి రాజకీయాలు చేసి వారు ఏం సాధిస్తారో కానీ.. ప్రజల ముందు ఇంకా ఇంకా చులకన అయిపోతున్నారు.
జగన్ రెడ్డి నుంచి అందరిదీ వికృత రాజకీయమే !
ఓ వైపు జగన్ రెడ్డి .. ఎక్కడికి వెళ్లినా తన వెంట తిరిగేలా గాలి మూకల్ని వెంటేసుకుని శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన బాటలో ఇతర చోటా నేతలు అదే పని చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా రెచ్చగొడితే.. అందరిపైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తమపై ఏదో ఓ దాడి చేస్తారని.. అప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బంగారు పాళ్యంలో మామిడికాయల్ని తామే పారబోసి…తామే తొక్కించి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంగ్లిష్ లో కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో జగన్ పోస్ట్ చేసుకున్నారు.
ప్రజలకు విరక్తి పుట్టిన రోజున సరైన శిక్ష
వైసీపీ నేతల వేషాలపై పోలీసులు చూస్తూనే ఉన్నారు. ఇంకా చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నేతలు కూడా సంయమనం పాటిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. తమ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు.. అదే సమయంలో తాము గీత దాటినా చట్టం తన పని తాము చేసుకుపోతుందన్న భయం టీడీపీ వర్గీయుల్లో ఉంది. వీళ్లకు సరైన ట్రీట్ మెంట్ అందాల్సిందేనన్న అభిప్రాయం ప్రజల్లో బలపడినప్పుడు జరగాల్సినవి జరిగి తీరుతాయి. అప్పుడు సానుభూతి కూడా రాదు. ఆ సంగతిని వైసీపీ నేతలు అర్థం చేసుకోవడం లేదు.