పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఆ సినిమాకు పని పట్టుకుని మరీ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారు వేలల్లో కనిపిస్తున్నారు. వారిలో సగానికి సగం మంది సినిమా చూసి ఉండరు. కానీ తమ సోషల్ మీడియా నైజాన్ని వారు బయట పెట్టుకున్నారు. కేవలం పవన్ కల్యాణ్‌పై ఉన్న కోపాన్ని ఇలా వ్యతిరేక ప్రచారంతో చూపిస్తున్నారు.
ఓ సినిమాకు పాజిటివ్ ప్రచారం కన్నా.. నెగెటివ్ ప్రచారం ఎక్కువ జరగడం కామనే. అయితే సినిమా బాగా లేనప్పుడు అలాంటి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ సినిమా ఎలా ఉందన్నది కూడాచూడని వారు.. సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సినిమా హిట్ అయితే .. పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా వచ్చే లాభం ఉండదు. కానీ ఆయన సినిమా హిట్ కాకూడదన్నది రాజకీయాల్లో ఉన్న కొంత మంది ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల ప్రయత్నం. సినిమా హిట్ లేదా ఫ్లాట్ మీద రాజకీయాలు ఉండవు. చాలా కాలం సెట్స్ మీద ఉన్న సినిమాను బయటకు తీసుకు రావాలనే.. నిర్మాతకు న్యాయం చేయాలనే పవన్ కల్యాణ్ సమయం కేటాయించారు.
ఓ వ్యక్తిని ఇంత వ్యతిరేకిస్తున్నారంటే.. ఆయన అంత బలంగా ఉన్నట్లుగా లెక్క. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గా ఉండబట్టి ఆయనను దెబ్బకొట్టడానికి ఇలా సోషల్ మీడియా మూకను రంగంలోకి దింపారు. వైసీపీకి చెందిన వారు చేసిన హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమో కానీ.. మొదటి నుంచి వైసీపీ నేతలు సినిమాను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే వారికి ఎంత భయమో..అర్థం చేసుకోవచ్చు. వీరమల్లు గురించి ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా.. చూసేవాళ్లు చూడకుండా ఉండరు. కానీ ఇంత వ్యతిరేక ప్రచారం చేస్తూంటే.. సినిమాలో ఏదో ఉందని చూడాలనుకునేవాళ్లు మాత్రం పెరిగే అవకాశం ఉంది.