ఉద్యోగులందరూ లంచగొండులేనా ? వైసీపీ ప్రచారం వర్కవుట్ అవుతుందా?

ఎన్నికలకు ముందు ఉద్యోగులంటే ఎంతో ప్రేమ చూపించిన వైసీపీ అధినేత జగన్, ఆ ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఉద్యోగుల్ని లంచగొండులుగా… విధులు నిర్వహించకుండా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వారిగా చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రభుత్వం అయితే వారికి జీతాలు తగ్గించడం లేదని పేజీలకు పేజీలు తమ వాదన రాసి ప్రజల వద్దకు తీసుకెళ్తోంది. ఆదాయం తగ్గిపోయిందని.. అయినా ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని చెబుతోంది. ఇప్పుడు అటు ప్రభుత్వం.. ఇటు వైసీపీ చేస్తున్న ప్రచారం భిన్న చర్చకు కారణం అవుతోంది.

టీచర్లు ఇటీవల ఓ రోజు కలెక్టరేట్లను ముట్టడించారు. ఆ తర్వాత టీచర్లందరిపైనా వరుస పెట్టి దాడి జరిగింది. ఎవరూ పాఠాలు చెప్పరని ఒకరు.. వారికి పాఠాలు చెప్పడం రాదని మరొకరు సోషల్ మీడియాలో ఎటాక్ ప్రారంభించారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని వడ్డీ వ్యాపారం.. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ టైం పాస్ చేస్తారని.. వారే బాగుండే ప్రభుత్వ స్కూళ్లు ఇలా ఎందుకు ఉంటాయని ప్రశ్నించడం ప్రారంభించారు . టీచర్లకు లంచాలు రావు కాబట్టి వైసీపీ నేతలు ఈ ప్రచార వ్యూహాన్ని అవలభించినట్లుగా తెలుస్తోంది.

ఇక ఇతర ఉద్యోగులపై లంచగొండి ముద్ర వేస్తున్నారు. లంచం లేకుండా ప్రభుత్వాఫీసుల్లో ఏ పని చేయరని.. అలాంటి వారికి మద్దతిచ్చేదేదమిటని ప్రజలను రెచ్చగొడుతున్నారు . ఉద్యోగులపై ప్రజల్లో ఉండే సహజ సిద్ధ వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టి వారికి మద్దతు రాకుండా చేయాల్సినంత ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా తమ వాదన తాము వినిపిస్తున్నారు. అయితే పని చేయరని.. లేపోతే లంచగొండులని ముద్ర వేసి.. ప్రజల్లో ఉద్యోగులపై వ్యతిరేకత పెంచడానికి .. ఇతర రాజకీయ పార్టీలపై వైసీపీ ఎలాంటి వ్యూహం పన్నిందో.. అలాంటిదే అమలు చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్ ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారో వారికీ అర్థం కావడం లేదు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రదర్శించిన స్వామిభక్తికి మెచ్చి ఎంతో కొంత మేలు చేస్తారనుకుంటే మొత్తానికే మోసం చేస్తున్నారని రగిలిపోతున్నారు. ఇప్పుడు బోనస్‌గా తమపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూండటంతో వారికి ఆగ్రహం మరింత పెరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆత్మకూరు బరిలో ఆనం కుమర్తె !

ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో...

ఎన్టీఆర్ జాతీయ అవార్డులెక్క‌డ‌?

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు మొద‌ల‌య్యాయి.యేడాది పొడ‌వునా.. ఎన్టీఆర్ ని స్మ‌రించుకుంటూనే ఉంటారు. ఈరోజు ఏ పత్రిక చూసినా, ఎన్టీఆర్ నామ స్మ‌ర‌ణే. నాయ‌కుంతా `జై ఎన్టీఆర్‌` అంటూ ఆయ‌న జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతున్నారు....

చిరు – వెంకీ కుడుముల… ఉందా..? లేదా?

ఆచార్య త‌ర‌వాత చిరంజీవి లెక్క‌లు మారాయి. ఆయ‌న కాసేపు... ఆగి, ఆలోచించ‌డం మొద‌లెట్టారు. వ‌రుస‌గా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌... త‌న కెరీర్‌కి ప్ల‌స్ అవుతుందా? లేదా? అనేది లోతుగా...

హిట్ ట్రాక్ కాపాడుకున్న అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కులు ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు రాజ‌మౌళి. ఇంకొక‌రు... అనిల్ రావిపూడి. మొన్న‌టి వ‌ర‌కూ కొర‌టాల శివ కూడా ఇదే జాబితాలో ఉండేవారు. కానీ `ఆచార్య‌` ఆ ట్రాక్ రికార్డుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close