సుభాష్ : నూతిలో కప్పల్లా వైసీపీ అండ్ రెడ్ గ్యాంగ్ !

నూతిలో కప్పలు తాము ఉన్నదే పెద్ద సముద్రమని తాము ఈదుతున్నదే సాగరమని అనుకుంటాయి. అవి ఎప్పటికీ అందులోనుంచి బయటకు రావు. తమ లోకంలో తాము బతికేస్తూ ఉంటాయి. బయట ప్రపంచాన్ని చూడలేదు. ఇప్పుడు ఏపీ రాజకీయంలో ఇలాంటి నూతిలో కప్పలు దండిగానే ఉన్నాయి. చాలా ఎక్కువ మంది బయటపడుతున్నారు కానీ కొంత మంది మిణుకుమిణుకు మంటున్న ఆశలతో ఆత్మవంచన చేసుకుని జగన్ రెడ్డి ఏదో మంచి చేశాడని నమ్మించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. జగన్ రెడ్డి ఎలాగూ తన లోపాల్ని చెప్పిని సరి చేసుకోడు పైగా మరింత చేట చేసుకుంటారు.. అందుకే జగన్ రెడ్డికి చెప్పుకోవడం కన్నా.. ఎదుటి పక్షం చేస్తున్నవి తప్పు అని.. అడ్డగోలుగా అర్థం పర్థం లేని విధంగా రాళ్లేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. నీలి, కూలి మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాసేసుకుంటున్నారు. గాసిప్ సైట్స్ లో అయినా జగన్ రెడ్డి ద్వేషించే సామాజికవర్గం పేర్లతో రచయిత్ని సృష్టించి… శక్తివంచన లేకుండా ఆత్మ వంచన చేసుకుంటున్నారు.

శక్తివంచన లేకుండా ఆత్మ వంచన చేసుకుంటున్న రెడ్ గ్యాంగ్

పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే… సిక్కోలు నుంచి ప్రకాశం జిల్లా వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ దాటదని.. ఆరు నెలల కిందటే రిపోర్టులు వచ్చాయి. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాల్లేని వరుస తప్పుడు కేసులు పెడుతున్న తర్వాత పరిస్థితి ఎంత వరస్ట్ గా మారిందో… సాామజిక బస్సు యాత్ర పేరుతో మంత్రులు తిరిగిన ఊళ్లలో పరిస్థితులే సాక్ష్యంగా ఉన్నాయి. జగన్ రెడ్డి ఎక్కడికీ పరదాలు కట్టుకోకుండా పోలేకపోతున్నారు. సభలు పెట్టి డ్వాక్రా మహిళల్ని, డబ్బులిచ్చి తెచ్చుకునే రోజు కూలీల్ని కూడా పట్టుమని గంట పాటు సభలో కూర్చోబెట్టలేకపోతున్నారు. ఇక స్వచ్చందంగా వచ్చే జనాలెక్కడ? అదే చంద్రబాబుకి ఉదయం బెయిల్ వస్తే రాజమండ్రి నుంచి ఉండవల్లి పోవడానికి పధ్నాలుగు గంటలు పట్టింది. అదీ కూడా ర్యాలీలు వద్దని కోర్టు ఆర్డర్ ని హడావుడిగా వైసీపీ తెచ్చుకుంటేనే. సజ్జల రెడ్డి ఆ ర్యాలీని చూసి అంత సేపు ఎలా వెళ్తారండీ అని చేసిన వ్యాఖ్యలే వారి తత్తరపాటుకు నిదర్శనం. ఇవన్నీ కళ్ల ముందు ఉన్నా.. చూడనట్లుగా కనిపించడం బావిలో కప్పల లక్షణం. అదే చేస్తున్నారు.

జగన్ రెడ్డి ఏదో చేశాడని ఊహించేసుకోవడం ఎందుకు..కాస్త గ్రౌండ్ లోకి వెళ్లొచ్చుగా !

అయితే అవన్నీ చూసినా చూడకపోయిన్నట్లుగా ఉండే ఈ రెడ్ గ్యాంగ్‌కు కాన్ఫిడెన్స్ పెరుగుతుందేమో కానీ.. జరగనివి జరుగుతున్నట్లుగా ఊహించుకునే హలోకేషన్ స్టేజ్ లో టాప్ పాయింట్ కు చేరుకున్నారు. జగన్ రెడ్డి ప్రజలకే ఏదో మేలు చేస్తున్నరని ఊహించేసుకుంటున్నారు. మెడికల్ కాలేజీలు వచ్చేశాయనుకుంటున్నారు. రియాలిటీలో చెప్పే మెడికల్ కాలేజీలకు మూడు అంటే మూడింటికి పర్మిషన్ వచ్చింది. మిగతా వాటిని కట్టలేదు. ప్రజలకు వైద్య సదుపాయాల గురించి ఎంత చెబితే అంత తక్కువ. చంద్రబాబు హయాంలో చనిపోతే ఉచితంగా మృతదేహాల్ని తరలించే అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేవి.. చంద్రన్న బీమా పేరుతో అప్పటికప్పుడు డబ్బుు చేతిలో పెట్టే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అంత కఠిన పరిస్థితుల్లోనూ మృతదేహాల్ని వేలు పెట్టి అంబులెన్స్ లలో తీసుకెళ్లాలి స్థోమత లేకపోతే బైక్ మీద అయినా తీసుకుపోవాలి. ఇది రియాలిటీ. ఇక వైద్య గురించి చెప్పాల్సిన పని లేదు. ఆస్పత్రుల్లో చేయకుండా మెడికల్ క్యాంపులు పెట్టి జగన్ రెడ్డి ఫోటోలు వేసుకున్న బ్యాంగుల్లో నాలుగు ట్యాబ్లెట్లు పెట్టి ఇచ్చి గొప్ప మేలు చేశామని ప్రచారం చేసుకుంటున్నరు. కానీ ప్రజలు ఖాండిస్తున్నారన్న విషయాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు.

కాస్త తల పైకెత్తి చూస్తే జగన్ రెడ్డి చేతకానితనం టన్నుల్లో కనిపిస్తుంది !

ఈ రెడ్ గ్యాంగ్ అంతా.. తమ చుట్టూ పేరుకుపోయిన గజ్జి నుంచి కాస్త తల పైకి ఎత్తి చూస్తే.. కనీసం రేషన్ కార్డు దారులకు రేషన్ బియ్యం అయినా జగన్ రెడ్డి హయాంలో సక్రమంగా అందుతుందో లేదో కనిపిస్తున్నారు. ఒక్క సారి గ్రౌండ్ రియాలిటీ చూస్తే అర్థమైపోతుంది. రేషన్ బియ్యం తీసుకునేవాళ్లు ఎలాంటి దీవెనలు అందిస్తున్నారు. మద్యం దుకాణాల దగ్గర నిలబెడితే… జగన్ రెడ్డికి అందుతున్న ప్రశంసలు ఏమిటో తెలుస్తాయి. రైతుల దగ్గరకు వెళ్తే వారు చెప్పే విషయాలు వింటే.. నిజంగా జగన్ రెడ్డి ఇంత అదృష్టం చేసుకున్నాడా అని..మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అసలు తన పాలనలో జగన్ రెడ్డి ఎవర్ని వదిలాడని… ఏ వ్యాపారం ఏపీలో సక్రమంగా జరుగోతందని. చివరికి ఫ్లెక్సీలు వేసుకునే వాళ్లని కూడా వదల్లేదు. ఏదో కోర్టు దయతో తమ కడుపు జగన్ రెడ్డి కొట్టకుండా కాపాడుకున్నారు కానీ.. వాళ్లూ బితుకుబితుకుమంటున్నారు. కాలేజీలు, స్కూళ్లు, ఇంజినీరింగ్ విద్య, సినిమా హాళ్లు, బార్లు… నిర్మాణ రంగం.. దేన్ని వదిలాడు జగన్ రెడ్డి ? . అందరి ఉపాధిని దెబ్బతీసి..ఏదో చేసేశాడని.. ఎలా ఆత్మవంచన చేసుకుంటున్నారు ?.

నమ్ముతున్న వాళ్లనూ ఓ మాదిరిగా చూడలేరా ?

ఇది ఏదో తమను నమ్మేవాళ్లను మరింత నమ్మించడానికి తాపత్రయం కానీ.. విపక్షం దూకుడును కూడా అలా చేస్తే.. మాకే మేలు అని అనకోవడం… చెప్పుకోవడం.. రాసుకనవడం.. పిచ్చి పరాకాష్టకు చేరిందని అనుకోవడంలో వింతేముంది. చంద్రబాబు కోసం జనం రోడ్ల మీదకు వచ్చినా రాలేదని రాసుకుని అహం సంతృప్తి పర్చుకున్నారు. ఇప్పుడేమో వచ్చారు కానీ.. వారంతా ఓ వర్గమని స్వయం తృప్తి పొందుతున్నారు.కానీ చివరికి నట్టి కుమార్ అనే వ్యక్తి కూడా జగన్ రెడ్డిని తిడుతున్నాడంటే.. పరిస్థితి ఏలా మారిందో అర్థం చేసుకోకుండా హలోకేషన్ లో బతికేస్తున్నారు.

పవన్ దూకుడులో బ్రహ్మానందం కాదు.. గేమ్ ఛేంజర్.. వైసీపీకి ఎండ్ గేమ్ ప్లేయర్

పవన్ కల్యాణ్ దూకుడులో బ్రాహ్మానందంలాగే .. నూతిలో కప్పలకు కనబడవచ్చుకానీ..అసలు ఆయన గేమ్ ఛేంజర్ అని.. ఇప్పటికే అర్థమైపోయింది. అందుకే ఈ విన్యాసాలు. ఆయన చూపించే ప్రభావమే … వైసీపీని నామరూపాల్లేకుండా చేయబోతోంది. రాజకీయాల్లో ఎప్పుడూ టూ ప్లస్ టూ కాదు. ఒక్కో సారి ఇరవై అవుతుంది. ఈ సారి ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే నలభై అయ్యేంత ప్రబావం చూపిస్తుందన్న రిపోర్టులతో కన్నూ మిన్నూ కానరాకుండా.. పిచ్చి రాతలతో స్వయంతృప్తి పొందుతున్నారు. రియాలిటీ ఏమిటో వాళ్లకు బాగా తెలుసు. కానీ నమ్మేవాళ్లను మోసం చేయడమే వారి నైజం.

పూరి జగన్నాథ్ ఐకానిక్ డైలాగ్ ఒకటి ఉంటుంది ” ఎవరినైనా మోసం చెయ్ బాగుపడతావు.. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనాకిపోతావ్ “అని. ఇక్కడ నమ్ముతున్న వాళ్లను మోసం చేసేందుకు నీలి,కూలి, గాసిప్ మీడియా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. కానీ ఆ నమ్మేవాళ్ల వాళ్ల సంఖ్య తగ్గిపోతోందని ఎప్పటికి గుర్తిస్తారో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

ఆ ఛానెల్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. డీప్ ఫేక్ ఆడియోతో పరువు నష్టం కలిగించారని ఓ న్యూస్ ఛానెల్ యాజమాన్యం, రిపోర్టర్ కు పువ్వాడ...

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close