ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు రాజకీయాలను వైసీపీ నేతలు ఎంత నీచంగా మారుస్తున్నారో సులువుగా అర్థమైపోయేలా చేస్తున్నాయి. జరుగతున్న పరిణామాలు చూస్తే ఎంత ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నారో అర్థమైపోతుంది. తల్చుకుంటే సామాన్య ప్రజలకు మరింత భయం కలుగుతుంది. రాజకీయ కుట్రల్ని, ఘోరాల్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్నారంటే.. వారి క్రిమినల్ బుర్రలు ఎంత అమానుషంగా ఆలోచిస్తాయో అని ఒళ్లు గగుర్పొడుస్తుంది.
నకిలీ మద్యం కేసు.. ఓ పక్కా ప్లాన్ !
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నకిలీ మద్యానికి చెక్ పడింది. అన్నీ పేరున్న బ్రాండ్లనే అమ్ముతున్నారు. అంతకు ముందు ఐదేళ్ల పాటు పేదల రక్తం పీల్చిన వ్యవహారం ప్రజల్లో చర్చకు వస్తోంది. మందు బాబుల్లోనూ ఇదే హాట్ టాపిక్ . కేసులు కూడా రక్తం పీల్చి వందల కోట్లు వెనకేసిన సుత్రధారి వద్దకు వస్తున్నాయి. దీంతో అసలు ఏపీలో నకిలీ మద్యం అమ్ముతున్నారన్న ప్రచారం చేయడానికి పక్కాన్ ప్లాన్ వేశారు. జోగి రమేష్ ద్వారా జనార్దన్ రావుతో ప్లాన్ చేయించారు.
వైసీపీ హైకమాండ్ స్థాయిలో జరిగిన కుట్రే !
నకిలీ మద్యం పేరుతో ఇప్పటి వరకూ జరిగిన రాజకీయం చూస్తే.. పై స్థాయిలో జరిగిన భారీ కుట్ర అని అర్థమైపోతుంది. మొదట ములకలచెరువులో నకిలీ మద్యాన్ని పట్టించారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారం ప్రారంభించారు. వెంటనే.. నకిలీ మద్యం వల్ల మరణాలు అంటూ సాక్షి పత్రికలో రాయడం ప్రారంభించారు. అంటే ఎంత ప్రణాళికాబద్దంగా ఈ కుట్ర జరిగిందో.. ఎంత ఉన్నత స్థాయిలో దీన్ని అమలు చేశారో చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి రాజకీయాలతో ప్రజలకేంటి లాభం ?
ఐదు సంవత్సరాలపాటు అడ్డగోలు పరిపాలన చేసి.. ప్రజల చేత ఛీత్కారానికి గురైన జగన్ రెడ్డి గ్యాంగ్ పదవి పోయిన తర్వాత తగ్గడం లేదు. తమను గుడ్డిగా నమ్మే వాళ్లు ఉన్నారని.. వాళ్లే తమ బలం అనుకుని రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసి.. ప్రజలపై కుట్రలు పన్నుతున్నారు. కానీ ఈ ప్లాన్లన్ని చాలా చెత్తగా ఉన్నాయి. బయటపడే ఇలాంటి ప్లాన్లను అమలు చేసి.. చేసే రాజకీయాలతో ప్రజల్లో తమపై ఏ మూల అయినా చిన్న సానుభూతి ఉంటే..దాన్ని అసహ్యంగా మార్చుకుంటున్నారు. అదనంగా పార్టీ నేతల్ని కేసుల పాలు చేస్తున్నారు.