వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరికి పులివెందులలోనూ డ్రామాలు వేయాల్సిన పరిస్థితికి వచ్చింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో పోలీసులు అనుమతించిన గ్రామానికి కాకుండా టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న గ్రామానికి వెళ్లి ఘర్షణ పడి .. డ్రామాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరగకపోయిన జరిగినట్లుగా.. చికిత్స తీసుకున్నట్లుగా.. చేతికి కట్టు లేకుండా.. చేసిన డ్రామాలతో నవ్వుల పాలయ్యారు. పులివెందులలోనూ డ్రామాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని వైసీపీ క్యాడర్ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు.
ఎక్కడైనా ఒకటే డ్రామా.. బోర్ కొట్టదా ?
వైసీపీ అంటే డ్రామాలు సహజం అన్నట్లుగా మారిపోయింది. జగన్ రెడ్డి కోడి కత్తి కేసు .. గులకరాయి దాడుల డ్రామాల నుంచి స్ఫూర్తి పొందుతారో లేకపోతే మన పార్టీ వ్యూహం అదే అని స్క్రిప్టులు ముందుగానే పంపుతారో కానీ.. దాడులు జరిగిపోయాయని డ్రామాలు ప్రారంభిస్తారు. అసలు దాడులు చేసేదే.. అసాంఘిక శక్తులు రాజ్యమేలే వైసీపీ పార్టీలోని నేతలే. అసలు దాడి జరిగిన దృశ్యం ఒక్కటీ బయటకు రాలేదు. కానీ కార్లు రగిలిపోయిన దృశ్యాలను మాత్రం చూపించి.. డ్రామాలు ప్రారంభించారు. ఇలాంటి డ్రామాలు చూసి.. చూసి ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు.
ఓటమికి కారణాలు వెదుక్కోవడానికే !
పులివెందులలో ఎప్పుడైనా గతంలో టీడీపీ నాయకుల దాడి లేదా.. ఇతర పార్టీల నాయకుల దాడి అనే మాట విని ఉంటామా ?. పులివెందుల మండలంలో అసలు ఉండదు. ఎందుకంటే అక్కడ అంతా వైఎస్ కుటుంబం గుప్పిట్లోనే ఉంటుంది. ప్రతి పల్లెలోనూ అదే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు సిగ్గు లేకుండా తమపై దాడి అని ప్రచారం చేసుకోవడానికి కారణం ఏమిటి ?. ఇపుడు బలవంతంగా ఓట్లు వేసుకోవడానికి.. రిగ్గింగ్ చేసుకోవడానికి చాన్స్ ఉండదు. ప్రజలు ఓట్లు వేయరు. అందుకే ఓటమికి కారణాలు వెదుక్కుంటున్నారు.
ప్రజాస్వామ్య రాజకీయాలు చేయకపోతే ఎప్పటికైనా ఇదే గతి !
పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబ ఆధిపత్యంలో ఉంది. ఎవరు వ్యతిరేకించినా వారిపై దాడులు తప్పవు. ఆర్థికంగా నష్టం చేసి రోడ్డున పడేస్తారు. కానీ ఎల్లకాలం ఇలా రాజకీయాలు చేయలేరు. ప్రజాస్వామ్యంలో అసలు చేయలేరు. అందుకే ఇప్పుడు జగన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి పులివెందుల బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది జగన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా తమ పార్టీపై దాడులు జరిగాయని.. తమ ఇలాఖాలోనే కొట్టారని .. ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలకు ఓటు వేసే హక్కు కల్పించలేదు. కానీ ఇప్పుడు వారు ఓట్లేయబోతున్నారు. అదే జగన్ రెడ్డి అసలు భయం.