‘ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి” అన్నట్టుగా వైసీపీ రాజకీయం చేస్తోంది. రాజధాని పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంతో ఏపీలో ఒక పండుగ వాతావరణం నెలకొంటే… వాటితో తమకేమి సంబంధం అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీపై విమర్శల డాడి కొనసాగుతోంది.
గత ఐదేళ్ళుగా ఏపీకి రాజధాని లేకుండా చేసి రాక్షసానందం అనుభవించింది వైసీపీ. రాజధాని లేని రాష్ట్రమని ఎగతాళి చేసేలా నిర్ణయాలు తీసుకుంది. అవమానభారంతో ఏపీ వాసులు మరోచోటుకు వెళ్లాలంటే భయపడే పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యంలోనే కూటమి అధికారంలోకి రావడం..అమరావతి నిర్మాణంకు చకచక అడుగులు పడటంతో ఉపశమనం లభించిన అనుభూతి ప్రజల్లో కనిపిస్తోంది.ఇక, శుక్రవారం ప్రధాని మోడీ అమరావతి పునర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నారని రాష్ట్ర ప్రజల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది.
తాము నిరాకరించిన అమరావతి రాజధాని కావడం వైసీపీకి ఇంకా అస్సలు జీర్ణం కావడం లేదు. అందుకే అమరావతి డెవలప్ మెంట్ కోసం కనీస సూచనలు, సలహాలు అయినా చేయకుండా ఇతరత్రా రాజకీయపరమైన వాదనలు తెరమీదకు తీసుకొచ్చి కోడిగొడ్డి మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని ముంగిట వేసుకుంటున్నారు. దీంతో వైసీపీ రాజకీయాలను చూసి ‘ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి” అన్నట్టుగా ఆ పార్టీ రాజకీయాలు ఉన్నాయని సెటైర్లు పేలుతున్నాయి.