పల్నాడు టెన్షన్..! చంద్రబాబు డిమాండ్‌కు జగన్ సర్కార్ ఓకే..!

చంద్రబాబు డిమాండ్ కు ప్రభుత్వం స్పందించింది. మొదట్లో బెట్టు చేసినా.. చివరికి ఓకే అంది. వైసీపీ కార్యకర్తల దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలను వారి వారి గ్రామాలకు తీసుకెళ్లి వదిలి పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పల్నాడులో అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాని… తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దాడులకు గురై… గ్రామల్లో ఉండలేక… వచ్చేసిన వారి కోసం.. తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఓ శిబిరం ఏర్పాటు చేసింది. ఆ శిబిరంలో ఉన్న వారిని పోలీసులు పరామర్శించి… వారి గ్రామాలకు తీసుకెళ్లి… వారి రోజువారీ జీవితాన్ని శాంతియుతంగా గడిపేలా భరోసా ఇవ్వాలని .. శిబిరం ఏర్పాటు చేసిన రోజున చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే.. తానే వారిని గ్రామాలకు తీసుకెళ్లి విడిచి పెడతానని ప్రకటించారు. అయితే.. వైసీపీ దాడులకు గురైన వారి గురించి పోలీసులు , ప్రభుత్వం లైట్ తీసుకుంది.

పోటీగా… టీడీపీ హయాంలో దాడులకు గురయ్యారంటూ.. పిడుగురాళ్లలో వైసీపీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత వెళ్లారు. టీడీపీ శిబిరంలో ఉన్న వాళ్లందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించే అవకాశం లేదని నిర్ణయించుకుని.. టీడీపీ అధినేత.. 11వ తేదీన చలో ఆత్మకూరు కు పిలుపునిచ్చారు. బాధితుల్ని తీసుకుని గ్రామాలకు వెళ్లి.. వారిని ఆయా.. గ్రామాల్లో వదిలి పెట్టి.. భరోసా ఇచ్చి రావాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు.. వైసీపీ దాడులకు గురైన బాధితులు.. కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. దీంతో.. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఐజీ, డీజీపీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

చలో ఆత్మకూరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటూండటం… బాధితులు కిషన్ రెడ్డిని కూడా కలిసి పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో… ఏపీ సర్కార్ లో కదలిక వచ్చింది. ఇప్పటి వరకూ చంద్రబాబు డిమాండ్ చేసినట్లుగా… బాధితుల శిబిరానికి వెళ్లాలనే ఆలోచన చేయని… పోలీసులు…. మనసు మార్చుకున్నారు. పోలీసు అధికారుల బృందం… వైసీపీ బాధితుల శిబిరానికి వెళ్తుందని… వారిని స్వగ్రామాలకు తీసుకు వెళ్లి… వారు శాంతిభద్రతలతో నివసించేలా… చూస్తారని.. హోంమంత్రి సుచరిత ప్రకటించారు. దాడులపై ఎక్కువగా ఫిర్యాదులొస్తున్నందున… పిడుగురాళ్లలో ఓ స్పెషల్ ఆఫీసర్‌ను కూడా నియమిస్తామని ప్రకటించారు. అయితే టీడీపీ మాత్రం వెనక్కి ఆలోచన చేయడం లేదు. పోలీసులు మాత్రం… పల్నాడు మొత్తం ఇప్పటి నుంచే 144 సెక్షన్ విధించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కరోనా కట్టడిపై తెలంగాణ గవర్నర్ దృష్టి..!

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ పెద్దగా పని చేయడం లేదంటూ వస్తున్న విమర్శల నేపధ్యంలో.. కొత్త పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళశై.. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని పరిస్థితిపై సమీక్ష...

బీజేపీ డబుల్ గేమ్‌కి సుజనా, సునీల్ లీడర్లు..!

అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ డబుల్ గేమ్ ఇప్పటికీ జోరుగా నడుస్తోంది. అమరావతి ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు అయిన సందర్భంగా.. రాజకీయ పార్టీలన్నీ కొత్తగా సంఘిభావం ప్రకటించాయి. ఇందులో...

ఎల్జీ పాలిమర్స్‌పై హైపవర్ కమిటీ రిపోర్ట్ : అన్నీ తెలిసినవే..!

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై.. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ రెండు నెలల తర్వాత నివేదిక సమర్పించింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు.. ప్రభుత్వం లైట్ తీసుకుంటోందంటూ తీవ్ర విమర్శలు రావడంతో.. సీనియర్ ఆఫీసర్ నీరబ్...
video

‘దిల్ బెచారా’ ట్రైల‌ర్‌: ల‌వ్ అండ్ ఎమోష‌నల్ జ‌ర్నీ

https://www.youtube.com/watch?v=GODAlxW5Pes హిందీ సినిమాల‌కు ఎక్క‌డైనా మార్కెట్ ఉంటుంది. షారుఖ్‌, స‌ల్మాన్‌, అమీర్‌, హృతిక్ సినిమాల‌కే కాదు.. యంగ్ హీరోల సినిమాల‌కూ క్రేజే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివ‌రి సినిమా గురించి కూడా అంత‌టా...

HOT NEWS

[X] Close
[X] Close