ఓ క్రిమినల్ పాలన చేపడితే క్రిమినల్స్ దే రాజ్యం అవుతుంది. అంతా నేరమయం అవుతుంది. ప్రజలు బాధితులు అవుతారు. ప్రజల్ని భయపెట్టి తాము వికటాట్టహాసం చేయాలనుకుంటారు. అదే జరిగింది. నేరస్తుల చేతుల్లో చేరిన పోలీసు వ్యవస్థ కూడా దారి తప్పింది. ఫలితంగా వైసీపీ హయాంలో ఏపీ అరాచకరాజ్యంగా మారిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా సాక్ష్యాలతో వెల్లడించింది.
క్రిమినల్ పాలనలో గొంతెత్తితే రాజద్రోహం కేసులే
జాతీయ నేర రికార్డుల బ్యూరో ‘క్రైమ్ ఇన్ ఇండియా’ 2023 నివేదికలో ఏపీ వైసీపీ హయాంలో పిల్లలు, మహిళలు, దళితులపై జరిగిన ఘోరాలు, నేరాల గురించి వివరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నేరాల రేటు 3.6 శాతం ఉంది. ప్రధానంగా పోలీసులు అంతా రాజకీయ కేసుల కోసమే పని చేశారు. రాజ్యద్రోహ కేసులు 2023లో దేశవ్యాప్తంగా 58 కేసులు నమోదు అయితే.. అందులో మణిపూర్ లో ఇరవై కేసులు పెట్టారు. అక్కడ జరిగిన అల్లర్లు, ఇతర విషయాల గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఏపీలో 11 కేసులు పెట్టారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేక గొంతెత్తినవారిని అణచివేయడానికి ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడలేదని అర్థం చేసుకోవచ్చు.
మహిళలపై అరాచకాల్లో విప్లవం
ఇకరాజకీయాల కోసం వర్గాల మధ్య చిచ్చులు పెట్టడంలోనూ వైసీపీ హయాంలో పెరిగిపోయింది. మణిపుర్ , మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధికంగా 200 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళలపై జరిగిన దాడుల గురించి చెప్పాల్ిసన పని లేదు. దేశవ్యాప్తంగా 8,416 కేసులు నమోదు అయితే అందులో 2,826 అంటే 33.57% ఏపీలో నమోదయ్యాయి. బాధితులు మొత్తం దేశంలో 8,661 ఉంటే ఒక్క ఏపీలో 3,020 మంది ఉన్నారు. జాతీయ రేటు 1.3 కాగా, ఏపీలో 10.6. అంటే ఎంత ఘోరంగా వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. షెల్టర్హోమ్లలో బాలికలపై లైంగిక వేధింపుల విషయంలోనూ ఉత్తరప్రదేశ్ తర్వాత మూడో స్థానంలో ఏపీ ఉంది.
దళితులపై లెక్కలేనన్ని దాడులు
ఇక దళితులపై జరిగిన దాడుల్లో ఏపీ దక్షిణాదిలోనే ప్రథమ స్థానంలో ఉంది. వారానికి ముగ్గురు దళిత మహిళలపై అత్యాచారం జరిగినట్లుగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయితే అందులో ఏపీలో 2,027 నమోదు అయ్యాయి. దక్షిణ రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం వారానికి సగటున 3 మంది దళిత మహిళలపై అత్యాచారం జరిగింది. ప్రతి నెలా ముగ్గురు దళితులు హత్యకు గురయ్యారు. నలుగురిపై హత్యాయత్నాలు జరిగాయి. వారానికి 11 మందిపై దాడులు.. రోజుకు సగటున 5-6 అకృత్యాలు దళితులపై జరిగాయి.
వైసీపీ హయాంలో శాంతిభద్రతలు అనేవి లేకుండా పోయాయి. ఏ వర్గానికీ రక్షణ లేకుండా పోయింది. అందుకే ప్రజలు భయంతో పాతాళంలోకి పడేశారు. అయినా వారు.. తమ తీరు మార్చుకోవడం లేదు.