రాజుగారి విందులో వైసీపీ సైడ్ రోలే..!

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఎంపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆ విందు చాలా లావిష్‌గా ఉంటుందని.. ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు మూడు వందల మంది ఎంపీలు వస్తారంటూ.. రఘురామకృష్ణంరాజు వర్గీయులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. విందు, విశేషాల గురించి గొప్పగా చెప్పారు. అయితే.. చివరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాత్రమే ప్రధాన అతిధిగా హాజరయ్యారు. బీజేపీ తో పాటు.. పలు పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. తృణమూల్, టీడీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు.

అయితే.. రఘురామకృష్ణంరాజు.. ఇచ్చిన ఈ విందులో వైసీపీ పాత్ర ఎక్కడా కనిపించలేదు. వైసీపీ ఎంపీ హోదాలో…రఘురామకృష్ణంరాజు విందు ఇచ్చారు. అయినప్పటికీ..వైసీపీకి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించలేదు. ఈ విందు ఇవ్వడానికి తమ అనుమతి తీసుకోలేదన్న అసంతృప్తి వైసీపీ పెద్దల్లో ఉంది. విజయసాయిరెడ్డి ఈ విందుకు హాజరు కాలేదు. ఎవరూ హాజరు కాకపోతే… మరో రకమైన ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో.. కావొచ్చు.. మిధున్ రెడ్డి మాత్రం.. విందుకు హాజరయ్యారు. విందులో.. వైసీపీ ఎంపీల హడావుడి కూడా కనిపించలేదు.

నిజానికి.. ఈ విందు .. బీజేపీ రాజకీయాల్లో భాగమన్న చర్చ జరిగింది. అందుకే.. ఈ విందులో ఏదో జరగబోతోందన్న వార్తలు ప్రారంభమయ్యాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే.. సహించేది లేదని.. జగన్.. ఎంపీలకు చెప్పి పంపినా.. రఘురామకృష్ణంరాజు లైట్ తీసుకున్నారు. తన పలుకుబడి పెంచుకుంటున్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలో వైసీపీ నేతలకు తెలియడం లేదు. ప్రస్తుతానికైతే.. వైసీపీ నాయకత్వానికి రఘురాకృష్ణంరాజు వ్యవహారాల్ని చూస్తూ.. వదిలి వేయడం తప్ప చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

టాలీవుడ్ ని క‌మ్మేస్తున్న క‌రోనా

టాలీవుడ్ ని క‌రోనా క‌మ్మేస్తోంది. సినీ స్టార్లు వ‌రుస‌గా కొవిడ్ బారీన ప‌డుతుండ‌డం.. టాలీవుడ్ ని క‌ల‌చివేస్తోంది. బండ్ల గ‌ణేష్ క‌రోనా బారీన ప‌డి కోలుకున్నారు. ఆ త‌ర‌వాత‌.. రాజ‌మౌళి, ఇత‌ర కుటుంబ...

అపెక్స్ వాయిదా.. సుప్రీంకు తెలంగాణ..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడిదింది. ఇరవయ్యో తేదీ తర్వాతే సమావేశం పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.,...

HOT NEWS

[X] Close
[X] Close