కృష్ణారెడ్డి.. ఇప్పుడీ పేరు వైసీపీ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చకు కారణం అవుతోంది. వైసీపీ వీరాభిమానిగా ఉంటూ ఆ పార్టీ పాలసీ ప్రకారం టీడీపీ నేతల్ని, ఇతర కులాల్ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ… వైఎస్ఆర్ పేరును తన చేతిలో పచ్చబొట్టుపై వేయించుకున్న కార్యకర్త ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నారు. అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చికిత్స కోసం సాయం అర్థించే పరిస్థితుల్లో ఉన్నారు.
ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోలేదు. ఎక్స్ పైర్ అయిపోయింది కాబట్టి డబ్బులు పెట్టి చికిత్స చేయించుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు కోట్లు కావాలి. అంత స్థోమతలేదు. అందుకే గో ఫండ్ మీలో అర్థిస్తున్నారు. రెండున్నర లక్షల డాలర్లు అవసరం అని అర్థిస్తే.. పట్టుమని పదివేల డాలర్లు కూడా ఇంకా సమకూరలేదు. వైసీపీ కార్యకర్తలెవరూ స్పందించడం లేదు. పార్టీ నేతలు కూడా స్పందించడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగుపడిన వాళ్లు రూపాయి సాయం చేయడం లేదు. దీంతో ఆ కృష్ణారెడ్డి కుటుంబం నరకయాతన పడుతోంది.
జగన్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతూంటే ఆయనకు తెలియదని ఎవరూ అనుకోలేరు. ఖచ్చితంగా తెలుస్తుంది. కనీసం సాయం చేసేందుకు కూడా మనసు రావడంలేదు. కానీ నాటాలు,ఆటాలు సాయం చేయడం లేదని తన పార్టీ కార్యకర్తలతో పోస్టులు పెట్టిస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాలు ఇలా వైసీపీ కార్యకర్తలకో టీడీపీ కార్యకర్తలకో సాయం చేయడానికి ఏర్పాటవలేదు. అయినా జగన్ రెడ్డి సాయం చేయకుండా ఇతరులు సాయం చేయడం లేదని అనడమే వారి మానసిక దౌర్భల్యానికి సాక్ష్యంగా మారుతోంది. ఈ వాదోపవాదాల సంగతి తర్వాత ముందుకృష్ణారెడ్డిని కనీసం ఇండియాకు అయినా తెప్పించి వైద్యం చేయించే ఏర్పాట్లు చేసినా.. కొంత మంది కార్యకర్తలకు ధైర్యం వస్తుంది. కానీ ఆ పనే చేయడం లేదు.
