బీఆర్ నాయుడుపై బురద చల్లేసి.. టీటీడీ కల్తీ నెయ్యి కేసు నుంచి డైవర్ట్ చేద్దామని వైసీపీ నేతలు చేసి ప్లాన్ ఇప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియాలో అతి చేసే వారందర్నీ అడ్డగోలుగా ఇరికించేసింది. ఆ వీడియోలు ఏఐ అని తేలడం మాత్రమే కాదు.. ఆ వీడియోల్లో ఉన్న మహిళతో పాటు బీఆర్ నాయుడు కూడా కేసులు పెట్టారు. ఏపీలో బీఆర్ నాయుడు కేసులు పెట్టగా.. హైదరాబాద్ ఆ వీడియోలో ఉన్నట్లుగా చెబుతున్న మహిళ ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు.
ఏఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ డీప్ ఫేక్ వీడియోలు పెట్టారో ఎంపిక చేసి మరీ తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కనీసం అరవై నుంచి డెభ్బై సోషల్ మీడియా ఖాతాలపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. ఇండియాకు ఎప్పుడు వచ్చినా పట్టుకుంటారు. ఇక్కడ ఇక్కడే ఉండి ఆ ఖాతాలను ఆపరేట్ చేస్తున్న వారికి అసలు సినిమా కనిపించనుంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జైళ్లకు వెళ్లి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు వేసిన ట్రాప్లో మళ్లీ పడ్డారు. వీళ్లందరికీ మరో రౌండ్ ప్రారంభం కానుంది.
అసలు ఈ వీడియోలు, ఫోటోలతో కాకుండా.. కొంత మంది టీడీపీలో యాక్టివ్ గా ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకున్నారు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా మరికొంత మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు బుక్కయిపోయారు. వీరంతా కేసుల పాలవడం గొప్పగా ఫీలవుతున్నారేమో తెలియదు కానీ.. కేసు నమోదయిన తర్వాత వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో తెలుసుకోలేకపోతున్నారు. వచ్చే వారం పది రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా నుంచి వియ్ స్టాండ్ విత్ అనే పోస్టర్లతో ఆర్తనాదాలు వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.