చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్న వైనం వైరల్ అవుతోంది. సామాన్యులతో ఆయన ఇంటరియాక్ట్ అవుతున్నారు. నెలకోసారి అయినా ఆయన ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన వారు మాత్రం ఇది పబ్సిసిటీ స్టంట్ అని పెదవి విరుస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లోకి వెళ్లకపోతే ప్రజల్లోకి వెళ్లడం లేదని వీరే అంటారు. గత సీఎం ఐదు సంవత్సరాల పాటు వర్క్ ఫ్రం ప్యాలెస్ చేశారు. సాధారణ ప్రజల్ని కలిసే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇలా ప్రజల్లోకి వెళ్లడం అందుకే వారికి నచ్చడం లేదు.
ఎప్పటికప్పుడు ప్రజల్ని కలుస్తున్న చంద్రబాబు
కారణం ఏదైనా చంద్రబాబు ఈ సారి ప్రజల్ని కలిసే ప్రణాళికల్ని మార్చుకున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్కు వెళ్లేటప్పుడు కనీసం కొంత మందిని కలిసేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు అక్కడున్న వారిని పలకరిస్తున్నారు. పెన్షన్లు ఇచ్చేందుకు తానే స్వయంగా వెళ్తున్నారు. పేద ప్రజల పట్ల తన దృక్పధం మారదని.. వారి బతుకుల్ని మార్చేందుకే తాను నిరంతరం కష్టడతానని ఆయన వారికి సంకేతాలు ఇస్తున్నారు.
పబ్లిసిటీ స్టంట్ అని ఇతర పార్టీల నేతలు విమర్శలు
ముఖ్యమంత్రి ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారు..అందర్నీ కలుస్తున్నారంటే.. సౌుత పార్టీ వారికి కనుల పండువగా ఉంటుంది.కానీ అదే విపక్ష పార్టీలకు కన్ను కుడుతుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలకు. ఎందుకంటే జగన్ రెడ్డి రోడ్డుపైకి వచ్చేవారు కాదు. ప్యాలెస్ కు వచ్చిన ప్రజల్నీ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ జగన్ రెడ్డి రోడ్డు మీదకు వెళ్తే మోకాళ్లపై వంగి దండాలు పెట్టే బ్యాచ్ కొంత మందిని రంగంలోకి దింపుతారు. అది మాత్రం ఆర్గానిక్ అని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. చంద్రబాబు సీఎం కాబట్టి.. ఆయన పబ్లిక్ లోకి వెళ్తే ఒక్క సారిగా ప్రజలు ఆయన మీద పడకుండా.. సెక్యూరిటీ నియంత్రిస్తుంది. ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటారో వారితో మాట్లాడతారు. అంత మాత్రం దానికే.. అది స్క్రిప్టెడ్ అనుకుంటే.. జగన్ రెడ్డి .. అడుగు వేయాలంటే.. చివరికి సొంత పార్టీ కార్యకర్తలతోనూ స్క్రిప్ట్ డ్రామానే పండిస్తారు. దాన్నేమనాలి?
వెళ్లకపోతే వెళ్లలేదంటారు.. లోకులు కాకులు !
లోకులు కాకులు అనే సామెత. ప్రతి దానికి అరుస్తూ ఉంటాయి. వైసీపీ నేతలు కూడా అంతే. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకపోతే సీఎం వెళ్లలేదంటారు. వెళితే.. అంతా పబ్లిసిటీ స్టంట్ అని విమర్శలు చేస్తారు. అందుకే చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పర్యటనలపై .. ప్రజల నుంచి వచ్చే ఆర్గానిక్ ఫీడ్ బ్యాక్ ను ప్రామాణికంగా తీసుకోవచ్చు కానీ.. వైసీపై నేతల కామెంట్లను లైట్ తీసుకోవచ్చు. ఏం చేసినా..ఏదో విధంగా గుక్కపెట్టడమే వారికి తెలిసిన విద్య.