వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జీతాల చిచ్చు ప్రారంభమయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికి .. అయితే డిజిటల్ కార్పొరేషన్ లేకపోతే..ఫైబర్ నెట్ అంటూ జీతాలు ఇచ్చేవారు. అలా ఇవ్వలేకపోతే మద్యం దుకాణాల వద్ద వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు సొంతంగా జీతాలు చెల్లించాల్సి వస్తోంది. అందుకే చాలా మందిని తగ్గించారు. కానీ ఇప్పుడు ఆ కొద్ది మందిలోనూ జీతాల చిచ్చు ప్రారంభమైంది. సగం మందికిపైగా అసంతృప్తితో రగిలిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
కొంత మందికి మాత్రమే లక్షల్లో జీతాలు
టీవీ యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టాడనికి నెలకు రూ.మూడు లక్షల జీతం ఇస్తున్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. పార్టీ కోసం తిరిగితే అదనంగా డబ్బులు ఇస్తున్నారు. అలాగే.. ఇటీవల కొంత మంది జైళ్లకు వెళ్లి వచ్చిన వాళ్లు .. పర్మినెంట్ గా వైసీపీ సోషల్ మీడియాలో పని చేయడానికి లక్షల్లో ఇస్తూ పార్టీ ఆఫీసులోనే పని చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే వీరంతా ఒకే వర్గానికి చెందిన వారు కావడంతోనే అసలు సమస్య. ప్రారంభమయింది.
ఇతరలకు చాలా తక్కువగా జీతాలు
ఇతర సోషల్ మీడియా సిబ్బందికి చాలా తక్కువగా జీతాలు ఇస్తున్నారు. గతంలో జగనన్న యాప్ అని ఉండేది.ఇప్పుడు అది లేదని చెబుతున్నారు. ఆ యాప్ ద్వారా గతంలో పోస్టులకు ఇంత అని ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఏర్పాటు లేదు. కానీ పేటీఎం అనే ముద్ర మాత్రం పడిపోయింది. ఇప్పుడు నేరుగా జీతాలిస్తున్నారు. స్వచ్చందంగా పని చేసేవారు కొంత మంది ఉన్నా.. వారు ఈ జీతాల గురించి తెలిసిన తర్వాత.. తమ గురించి పట్టించుకోవాలని…. ప్రస్తుతానికి పేరుకు సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్న దొడ్డా అంజిరెడ్డి వెంట పడుతున్నారు. వీరి బాధ తట్టుకోలేక ఇలాంటి వారి ఫోన్లు ఆయన ఎత్తడం లేదని చెప్పుకుంటున్నారు.
స్వచ్చందంగా పని చేసేవారు కరవు
క్యాడర్ ను ఘోరంగా వాడుకుని వదిలేస్తూ ఉండటంతో జగన్ రెడ్డి కోసం స్వచ్చందంగా పని చేసేవారు కరవయ్యారు. వారు పంపించే కంటెట్ పూర్తిగా అవాస్తవాలు , ఫేస్లు, మార్పింగులు కావడంతో… ఎందుకైనా మంచిదని ఎక్కువ మంది పట్టించుకోవడంలేదు. అందుకే పెయిడ్ ఆర్టిస్టుల మీదనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. వారికి జీతాలివ్వడంలో వివక్ష చూపిస్తూండటంతో సంక్షోభం ఏర్పడుతోంది.