వైసీపీ బలం ఎదురుదాడి. తాము చేసే నేరాలు, ఘోరాలు అన్నీ ఎదుటి వారే చేస్తున్నారని సిగ్గులేకుండా ప్రచారం చేసి … తమను నమ్మేవారిని నమ్మించడం వారి శైలి. వారి లక్ష్యం ఏమిటంటే మేము మాత్రమే కాదు ఎదుటి వారు కూడా చేశారు అని బ్యాలెన్స్ చేసుకోవడమే. చాలా కాలంగా దీన్ని విజయవంతంగా చేశారు. కానీ ఇప్పుడు స్ట్రాటజిస్టులు మాత్రం దివాలా తీసినట్లుగా ఉన్నారు. లిక్కర్ స్కాంపై ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరుగుతూంటే… ఎలా ఎదుర్కోవాలో తెలియక.. వింత వింత వాదనలతో తెరపైకి వస్తున్నారు. నిందితులంతా టీడీపీ వారు అని చెప్పడానికి ప్రయత్నించడం ఆ దివాలాలో మరో రకం.
లిక్కర్ స్కాం నిందితులు టీడీపీకి సన్నిహితులట !
లిక్కర్ స్కాం అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశమైన స్కాం. ఇందులో ఎలాంటి అవకతవకలు లేవు అని చిన్న పిల్లాడు కూడా నమ్మడు. మద్యం కొన్న ప్రతి ఒక్కరూ తనను జగన్ రెడ్డి దోచుకున్నాడని ఫీల్ అయ్యారు. అంత ఘోరంగా వ్యవస్థీకృతంగా మద్యం దోపిడీ చేశారు. ఇంకా చెప్పాలంటే జగన్ రెడ్డి తన ఓటు బ్యాంకును అడ్డగోలుగా దోచుకున్నారు. ఆ ఫలితం ఏమిటో ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు ఆ దోపిడీ కేసులు ఎదురు వస్తున్నాయి. ఎలా ఎదుర్కోవాలో తెలియక అసలు లిక్కర్ స్కాం లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్టు అవుతున్న నిందితులు టీడీపీకి సన్నిహితులని అంటున్నారు.
దొరికిన సొంత వాళ్లందరిపై టీడీపీ ముద్ర జగన్ స్టైల్
రాజ్ కెసిరెడ్డి అనే వ్యక్తి ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసింది. జగన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు విజయసాయిరెడ్డితో పాటు ఉన్న మరో వ్యక్తి రాజ్ కెసిరెడ్డి. ఐదు సంవత్సరాల పాటు ప్రజల రక్త మాంసాలను పీల్చడంలో ఆయనది కీలకపాత్ర. ఇప్పుడు ఆయన హఠాత్తుగా టీడీపీ నేతలకు సన్నిహితుడని సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డిని కూడా అదే గాటన కడుతున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన వారందరూ టీడీపీ నేతలేనని సాక్షిలో రాయించుకుంటున్నారు. ఈ రాతలు చూసి వైసీపీ అభిమానులు కూడా ఇదేం స్ట్రాటజీ అని ఫీలవుతున్నారు. తల్లీ, చెల్లిని కూడా టీడీపీ ఖాతాలో వేసిన జగన్ రెడ్డికి వీరందర్నీ టీడీపీ ఖాతాలో వేయడం పెద్ద విషయం కాదులే అని సర్దుకుపోతున్నారు.
వైసీపీ వ్యూహకర్తలు ఇంత డ్రై అయిపోయారా ?
లిక్కర్ కేసులో తప్పు జరగలేదని వైసీపీ చెప్పినా ఎవరూ నమ్మరు. అంత అడ్డగోలుగా దోపిడీ చేశారు. పన్నులు లేకుండా… నా డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను బెల్టు షాపుల్లో అమ్మించారు. ఆయా కంపెనీలు.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయలేవు. ఏపీకే సరఫరా చేస్తాయి. వాటి ఉత్పత్తి రికార్డులకు.. ఏపీబీసీఎల్ కు సరఫరా చేసిన దానికి పొంతన లేదు. మిగతా సరుకంతా బ్లాక్ లో పన్నుల్లేండా అమ్మేశారు. ఆ డబ్బంతా షెల్ కంపెనీలతో వైట్ గా మార్చారు. అవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు స్కాం జరగలేదని.. సాక్షిలో రాయిస్తే పని అయిపోదుగా..! నిందితులందరూ టీడీపీ నేతలకు సన్నిహితులే అని ఓ రాయి వేస్తే తప్పించుకోలేరుగా ! . కనీసం తమ సొంత కార్యకర్తలు అయినా నమ్మేలా ఉండే కథలను.. రాయలేనంతగా వైసీపీ స్ట్రాటజిస్టులు ఎందుకు డ్రై అయిపోయారో !