వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన తన మాటల్ని సమర్థించుకుంటున్నారు. తాను ఆమె క్యారెక్టర్ పై వేసిన నిందలన్నీ నిజాలేనని.. వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదంటున్నారు. ఆయన తీరుతో వైసీపీపై మహిళలు ఇకా ఆగ్రహం వ్యక్తం చేసేలా ఉన్నారు. ఈ అంశంపై వైసీపీ పెద్దలు ఇంత వరకూ మాట్లాడలేదు.
వైసీపీ నెల్లూరు నేతలు మాత్రం .. ప్రసన్నకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇతరులు ప్రశన్నకుమార్ రెడ్డి మాటల్ని ఖండించడం లేదు. అంటే అంతిమంగా..ఆయన మాటల్ని సమర్థిస్తున్నట్లుగానే భావించాల్సి వస్తుంది. అంటే వైసీపీ నైజం ఏ మాత్రం మారలేదని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఘోరమైన మాటలు.. మహిళల్ని కించ పర్చడం.. మానసిక రోగులుగా వ్యవహరించడం. ఇప్పటికీ వారు మారడంలేదని ప్రజలు ఓ క్లారిటీకి వస్తే ఇంకా నష్టం జరుగుతుంది.
ఈ అంశంపై టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. వేమిరెడ్డిపై జగన్ చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆ మాటలకు.. జగన్ మద్దతు ఉన్నట్లుగానే భావిస్తామని అంటున్నారు. ఇప్పటికీ పదే పదే ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. జైలుకైనా వెళ్తానని నల్లపురెడ్డి చెబుతున్నారు. ప్రశాంతి రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నల్లపురెడ్డి ఇంటిపై ఎవరు దాడి చేశారన్నది మాత్రం ఇంత వరకూ స్పష్టత లేదు. సీసీ కెమెరా దృశ్యాలు కూడా నల్లపురెడ్డి విడుదల చేయలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.