ఐపీఎస్ అధికారి కాస్తా జగన్ సర్వీస్ అధికారిగా మారి అడ్డగోలు పనులు చేసిన పాపం పండింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన తప్పుడు పనులు చేసి.. నిర్బయంగా ప్రజాధనం కోట్లు దోచుకున్న వైనంపై నమోదైన కేసులో.. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవినీతికి పాల్పడ్డారు.ఈ అంశంపై కేసు నమోదు కావడంతో.. ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. హైకోర్టులో ప్రభుత్వ వాదన వినకుండానే న్యాయమూర్తి 49 పేజీల తీర్పు ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సంజయ్ అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు అడిగింది. ఒప్పందాలు, చెల్లింపులతో సహా పోలీసుల దర్యాప్తులో తేలిన వాటిని సుప్రీంకోర్టుకు ఇచ్చారు.
సంజయ్ బెయిల్ కోసం. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ను పెట్టుకున్నారు. మొదటి నుంచి ఆయన వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు చివరికి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గురువారం వాదనలు వినిపించాల్సిందేనని స్పష్టం చేసింది. వాదనలు విన్న తర్వాత సంజయ్ ముందస్తు బెయిల్ రద్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సంజయ్.. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చేసి.. మార్గదర్శితో పాటు చంద్రబాబుపైనా తప్పుడు కేసులతో వీరంగం సృష్టించారు. పొన్నవోలుతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేశారు.