చంద్రబాబును పొగిడారని సూపర్ స్టార్ రజనీకాంత్ పై విరుచుకుపడ్డారు వైసీపీ మూక. కొడాలి నాని దగ్గర నుంచి అందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఆయన ఏమన్నారు.. జగన్ ను చిన్న మాట అనలేదు. రాజకీయ కార్యక్రమానికి రాలేదు. ఆయన వచ్చింది కేవలం ఎన్టీఆర్ కార్యక్రమంలో పాల్గొనడానికి. చంద్రబాబు గురించి తన అభిప్రాయం చెప్పారు. దాంతో మూక దిగిపోయి ఆయనపై బూతులతో విరుచుకుపడింది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా వారు మారడం లేదు. ఇప్పుడు ఇంకా ఘోరంగా బ్రహ్మశ్రీ చాగంటి వారిని టార్గెట్ చేస్తున్నారు.
విద్యా విలువల సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి వారు కుటుంబ విలువలు గురించి, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని అన్నారు. అంతే ..అసలు రాజకీయాలు మాట్లాడలేదు. కానీ వైసీపీ సైకోలకు మాత్రం నచ్చలేదు. వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. నానా మాటలు అంటున్నారు. వారి తీరు చూసి మరోసారి అందరూ విస్తుపోతున్నారు.
బ్రహ్మశ్రీ చాగంటి ఏమన్నారు.. ఆయన ఎప్పుడూ చెప్పే ప్రసంగాలను, విలువలను బోధించారు. అంతే కానీ జగన్ గురించి చెప్పలేదు. జగన్ తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసి వారిని కోర్టుకు లాగితే దానికి ఎవరు బాధ్యులు?. అయినా చాగంటి అసలు ఆ సందర్భాన్ని ప్రస్తావించలేదు. తల్లిని గౌరవించడం అనేది మన సంస్కృతిలో భాగం. జగన్ దాన్ని గౌరవించకపోతే ఇక తల్లిని గౌరవించాలి.. అని చెప్పడం తప్పవుతుందా ?. కానీ ఈ విషయాన్ని సోషల్ మీడియా సైకోలు అర్థం చేసుకోరు.
బ్రహ్మశ్రీ చాగంటి వారు పైసా ఆశించకుండా సమాజంలో మంచిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. భావితరాలకు విలువల్ని నేర్పుతున్నారు. ఆయన లాంటి వారిని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. అలా చేయలేకపోతే వారు కనీస మానవ విలువల్లేనట్లే.