2018-19 పంచాయతీ అవార్డుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం 15 అవార్డులు ఇచ్చింది. ” ఈ – పంచాయతీ పురస్కార్‌” కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. సాధారణ కేటగిరిలో ప.గో జిల్లాకు జిల్లాస్థాయి పురస్కారం లభించింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం, గుంటూరు జిల్లా మేడికొండూరు, చిత్తూరు జిల్లా రామచంద్రాపురం, కడప జిల్లా చెన్నూరులకు జనరల్‌ కేటగిరిలో .. విజయనగరం జిల్లాలోని కొండకింద, ప్రకాశం జిల్లాలోని వేములకోట, గుంటూరు జిల్లాలోని అంగలకుదురు గ్రామ పంచాయతీలకూ వివిధ విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. తూ.గో జిల్లాలోని చెల్లూరు, ప్రకాశం జిల్లా కురిచేడు, గుంటూరు జిల్లాలోని కఠెవరం… విజయనగరం జిల్లాలోని బొండపల్లి వంటి గ్రామాలకు వివిధ అవార్డులు వచ్చాయి. మొత్తంగా పదిహేను అవార్డులు వచ్చాయి.

గ్రామ సీమల్లో సంస్కరణలకు 15 అవార్డులు..!

మామూలుగానే ఊరూపేరూ తెలియని విదేశీ హైకమిషనర్లు చిన్న ప్రశంస ఇస్తేనే… హెడ్ లైన్ లకి  ఎక్కించుకునే వైసీపీ నేతలు ఊరుకుంటారా..?. ముందుగా పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి తెర ముందుకు వచ్చేశారు. అవార్డుల గురించి గొప్పగా ప్రకటించారు. తన శాఖ కాబట్టి క్రెడిట్ తనకే అన్నట్లుగా ఆయన చెప్పారు కానీ.. అలా చెప్పుకోలేని పరిస్థితి వైసీపీలో ఉంటుంది. అందుకే.. చివరిగా అంతా జగన్ చలువేనన్నారు. అంతటితో అయిపోలేదు. తర్వాత పంచాయతీ రాజ్ శాఖను చూసే ఉన్నతాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ రంగంలోకి వచ్చారు. అయితే ఆయన నేరుగా మీడియాలోకి రాలేదు. సోషల్ మీడియాలోకి వచ్చారు. ఇలా 2020 ఏడాదికి అవార్డులు వచ్చాయని.. సాక్షి వెబ్ సైట్‌లో వచ్చిన వార్తను రీ ట్వీట్ చేశారు.

2020లో ఇచ్చారు కానీ 2018-19లో చేసిన పనికి వచ్చాయి..!

కానీ ఇక్కడే మతలబు ఉంది. ఎందుకంటే.. గోపాలకృష్ణ ద్వివేదీ సాక్షి వార్తల్ని కాకుండా.. నేరుగా.. కేంద్ర ప్రభుత్వం తనకు పంపిన… అవార్డుల లేఖను… సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే ఇంకా సూపర్‌గా ఉండేది.. విశ్వసనీయంగా ఉండేది. అవార్డులు వచ్చాయని సాక్షిలో చెప్పడం కాదు.. నిజంగానే ప్రూఫ్ చూపించినట్లుగా ఉండేది. కానీ ఎవరూ ఆ లేఖను బయట పెట్టలేదు. పంచాయతీరాజ్ వెబ్ సైట్ నుంచి.. ఇతరులు డౌన్ లోడ్ చేసి చూసుకుంటేనే.. ఆ అవార్డుల గురించి తెలుస్తోంది. ఓపికతో అలా చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఎందుకంటే.. ఆ అవార్డులు.. 2020లో ప్రకటించారు కానీ.. అసలు అవార్డులు పొందిన గ్రామాల పనితీరును ఎసెస్ చేసిన సంవత్సరాలు మాత్రం 2018-19. అప్పుడు ఆ శాఖకు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు.

అధికారులకూ ఈ అత్యుత్సాహం ఎందుకో..?

2020లో ప్రకటించారు కాబట్టి.. 2020 సంవత్సరానివే ఆ అవార్డులన్నట్లుగా వైసీపీ నేతలు.. మంత్రులు.. ప్రచారం చేసుకుటున్నారు. వారికి అధికారులు వంత పాడుతున్నారు. అది గత ప్రభుత్వానికి చెందిన క్రెడిట్ కాబట్టి.. ఆ మంత్రులు ఉన్నప్పుడు.. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చాయని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. ఈ ప్రభుత్వ పనితీరుకు.. వచ్చాయని చెప్పాల్సిన అవసరం ఏముందన్నదే ప్రశ్న. పక్కోడి పనికి తాను క్రెడిట్ తీసుకోవడం ఏమిటన్న కామెంట్స్ ఇందుకే వినిపిసతున్నాయి. ఎంతో గొప్పగా పని చేస్తే.. వచ్చే ఏడాదో.. ఆ పై వచ్చే ఏడాదో.. అంత కంటే ఎక్కువే అవార్డులొస్తాయిగా.. కక్కుర్తి పడటం ఎందుకన్నదే ప్రశ్న. కానీ రాజకీయాలకు ఇలాంటిదేమీ ఉండదు కానీ.. అధికారులకు మాత్రం ఉండాలేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close