వైసీపీ నేతలు తాము చెప్పిందే అందరూ నమ్ముతారని ఎందుకు అంత గట్టిగా రుద్దుతారో చాలా మందికి అర్థం కాదు. వాళ్ల చరిత్ర గురించి అందరికీ తెలిసినా సరే రద్దుడుకు మాత్రం వెనుకాడరు. అలాంటి వారిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. తానేదో హిందువునని..శ్రీవారిభక్తుడినని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన గురించి తెలియనిది ఎవరికి?. తన గురించి తెలియదని ఆయన అనుకుంటున్నారో..పది సార్లు చెబితే.. నమ్మేస్తారని అనుకుంటున్నారో .. ఎవరికీ అర్థం కావడం లేదు.
భూమన హిందూమతానికి పచ్చి వ్యతిరేకి
భూమన కరుణాకర్ రెడ్డికి దేవుడిపై నమ్మకం లేదు. హిందూమతంపై అసలు నమ్మకం లేదు. ఆయనది రాడికల్ భావజాలం. శ్రీవేంకటేశ్వరుడికి నల్లరాయి అని ఘోరమైన మాటలు మాట్లాడిన సభలు చాలా ఉన్నాయి. ఆయన పెళ్లి నాస్తిక వాదుల సమక్షంలో జరిగింది. ఇదంతా తిరుపతి లో అందరికీ తెలుసు. రాడికలిజం పేరుతో ఆయన చేసిన పనుల సంగతి పక్కన పెడితే ఆయన భావజాలంలో దేవుడు లేడు..హిందూత్వం లేదు. అది అందరికీ తెలిసిన సత్యం.
పదవుల కోసం భావజాలానికి ముసుగు
జైల్లో ఉన్నప్పుడో.. ఇతర సంబంధాల వల్లనో కానీ వైఎస్ కుటుంబంతో కరుణాకర్ రెడ్డికి బంధుత్వం ఏర్పడిన తర్వాత.. వైఎస్ ఆయనను ప్రోత్సహించారు. ఆయన భావజాలం తెలిసి కూడా.. టీటీడీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. దేవుడిపై ఏ మాత్రం నమ్మకం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉంటే .. ఏం చేయగలరో అన్నీ చేశారు. ఆయనకు హిందూ దేవుళ్లపైనే నమ్మకం లేదు. క్రిస్టియానిటీపై నమ్మకం లేదని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన హయంలోనే దేవదేవుడి తిరుమలలో అపచారాలు ప్రారంభమయ్యాయి. తాను దేవుడి భక్తుడినని చెప్పుకోవడం అప్పటి నుంచే ప్రారంభించారు. నామాలు పెట్టుకుని హిందూత్వానికి పంగనామాలు పెట్టడం ప్రారంభించాడు. ఆయన నిజాయితీ పరుడైతే.. దేవుడిని దోచుకోవాలన్న ఉద్దేశం లేకపోతే ఆయన భావజాలానికి ముసుగు వేయరు.
కుమార్తెను క్రిస్టియన్ కు ఇచ్చి పెళ్లి చేసింది నిజం కాదా?
భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తెను క్రిస్టియన్ కుటుంబానికి పంపించారు. క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేశారు. అప్పటికి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి హిందువుల్ని మభ్యపెట్టడానికి మళ్లీ హిందూ పద్దతిలో పెళ్లి చేసి అందర్నీ పిలిచారు. తాను హిందువునని..తన కుమార్తెను క్రిస్టియన్ ఇంటికి పంపించాలని ఆయన చెప్పుకోవడానికి ఇలా చేశారు. ఎందుకంటే ఆయన అప్పటికీ టీటీడీ చైర్మన్ గా చేశారు.
ఈ అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఆయన గురించి అంత ఎక్కువగా చర్చ జరుగుతుంది. టీడీపీకి కావాల్సింది కూడా అదే.