తుఫాన్ మొంథా కాకినాడ తీరం వైపు దూసుకు వస్తోంది. అది చాలా ప్రభావంతమైనదని ఇప్పటికే అన్ని వైపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తూ అధికారుల్ని అప్రమత్తంగా ఉంచుతున్నారు. దీన్ని కూడా వైసీపీ నేతలు.. వారి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రచారం కోసం ఇలా చేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు.
తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యమంత్రిగా ఆయన విధి. అలా చేస్తే మీడియా రిపోర్టు చేస్తుంది. చంద్రబాబు అంటే ఇష్టం లేదు అంటే.. ఆయన చేసే పనుల్ని పట్టించుకోకపోతే సరిపోతుంది. అంతే కానీ ఆయన పని చేయడం తప్పు అన్నట్లుగా పోస్టులు పెడితే ఎలా?. విమర్శలు చేస్తే ఎలా?. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్యాలెస్ లోనే ఉండి.. సమీక్ష చేసినట్లుగా రెండు ఫోటోలు, పత్రికా ప్రకటన విడుదలయ్యేవి. నిజంగా ఆయనచేసేవారు కాదు. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ ఉండదు. ఏం చెప్పాలో తెలియదు.
కానీ చంద్రబాబు అలా కాదు కదా. ఆయనకు మొత్తం తెలుసు. ఎలాంటి సంక్షోభంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన బాగా గైడ్ చేస్తారు. అధికారుల్ని అవసరం అయితే గద్దించి పనులు చేయించుకుంటారు. చేయించుకోవాలి కూడా. కానీ దీన్ని అతి అనుకుంటే.. వైసీపీ నేతల మైండ్ సెట్ ను ఏమనుకోవాలి. సీఎం ఉందని పని చేయడానికే.. ఆయన పనికి ప్రచారం వస్తుంది. అది అతి అనుకుని.. విపత్తులు వచ్చినప్పుడు గాలికి వదిలేసే జగన్ రెడ్డి పనితీరు సూపర్ అనుకోవాలా?. ఇదేం రాజకీయం ! ?
