వైసీపీకి ఏదీ కలసి రావడం లేదు. కూటమి ముఖ్యనేతలపై ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేయడానికి బరి తెగిస్తున్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత పర్యటనలు,లోకేష్ పర్యటనలకు ఖర్చులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజాలు బయటపెట్టినా .. అవి మాత్రం చెప్పడం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన వివరాలు చెప్పడం లేదు. కానీ అదే సమయంలో జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఖర్చుల వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు గతుక్కుమనాల్సి వస్తోంది.
నారా లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలు అయినా.. మంత్రిగా విధుల్లో భాగంగా పర్యటించాల్సి వచ్చినా.. ప్రత్యేక విమానాలు వాడాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తున్నారు. ఆ విషయం ఆర్టీఏ చట్టం ప్రకారం దరఖాస్తు చేస్తే వివరాలు బయటకు వచ్చాయి. అదే సమయంలోజగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో చేసిన ఖర్చుల వివరాలూ బయటకు వచ్చాయి. ఆయన ఏకంగా 222 కోట్ల రూపాయలు తన ప్రయాణాలకోసం వాడారు. వర్క్ ఫ్రం ప్యాలెస్ చేసిన ఆయన విదేశీ పర్యటనలకు అత్యంత లగ్జరీ విమానాలు వాడేవారు. ఇక ఏపీలో .. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్లాలన్నా హెలికాఫ్టర్.. అదే వేర్ ప్రాంతానికి అయితే విమానం ప్లస్ హెలికాఫ్టర్.. స్పేర్ గా మరో హెలికాఫ్టర్ వాడేవారు. ఇలా ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టారని అధికారికంగా తేలింది.
తప్పు చేసింది తాము అయితే కూటమి నేతలు చేస్తున్నరాని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ అంశంపై జాతీయ మీడియాలోనూ చర్చ జరిగింది. జగన్ రెడ్డి నిర్వాకాలు మరోసారి వైరల్ అయ్యాయి. ప్రజా ధనంతో సొంత విలాసాలు చేసుకున్న జగన్.. ఇప్పుడు లోకేష్ , పవన్ పై నిందలేసిందుకు ఏ మాత్రంర సిగ్గుపడటం లేదు.
