వైఎస్ఆర్సీపీకి గాలి కొట్టడానికి సాక్షి తో పాటు మరో రెండు చానళ్లు ఎంత ప్రయత్నించినా.. వారు చేసిన పోరాటానికి బీభత్సమైన హైప్ తీసుకురాలేకపోతున్నారు. జగన్ రెడ్డి బిగ్ బాస్లా కాళ్లు చాపుకుని తమ లీడర్ల రైతుపోరు నిరసనల్ని జడ్జ్ చేస్తున్నారేమో కానీ.. చాలా మంది నేతుల రోడ్డెక్కి హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. మెజార్టీ నేతలు ముందుగానే హౌస్ అరెస్టులు అయిపోయారు. కొంత మంది మాత్రం.. పోలీసులు హౌస్ అరెస్టులు చేయడానికి రాలేదని ర్యాలీలు చేశారు.
అంబటి రాంబాబు, విడదల రజనీ లాంటి వాళ్లు..గట్టిగా ఓ యాభై నియోజకవర్గాల్లో రైతుపోరు అని ఓ వందమందిని వెంటేసుకుని ర్యాలీలు నిర్వహించారు. ఆర్డీవోకు వినతి పత్రాలు ఇచ్చి.. సాక్షి మీడియా ముందు డాంబికాలు పోయారు. అదే మహా ప్రసాదం అనుకుని.. ఆరేడు బాక్సుల్లో అవే దృశ్యాలు చూపిస్తూ.. గాలి కొట్టడం ప్రారంభించాయి..వైసీపీ మీడియాలు. జగన్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయిన క్యాడర్ అసలు రాజకీయ పోరాటాలకు ముందుకు రావడం లేదన్నది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం.
జగన్ రెడ్డి లిక్కర్ స్కాం చేసి అంతో ఇంతో సంపాదించుకునే అవకాశం ఇచ్చిన కొంత మంది, ఇతర దోపిడీ చేయాడనికి అవకాశం లభించిన కొంత మంది మాత్రమే .. నిరసనలు చేస్తున్నారు. అత్యధిక మంది వైసీపీ నేతలు హౌస్ అరెస్టులు చేసుకోవాలని పోలీసులకు సమాచారం ఇచ్చి.. సైలెంట్ అయ్యారు. పరిస్థితి ఏమిటో జగన్ రెడ్డి తెలుసుకుంటారా లేకపోతే.. సాక్షిలో చూపించేది నిజమేనని.. దుమ్మురేపామని అనుకుంటారో చూడాల్సి ఉంది.