కల్తీ నెయ్యి స్కాంలో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి విచారణకు రాకుండా తప్పిXచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 13న సిట్ విచారణకు హాజరు కావాలంటూ వైవీ సుబ్బారెడ్డి కి సీట్ నోటీసులు జారీ చేసింది. కానీ సుబ్బారెడ్డి తనకు కుదరదని.. 15 తరువాత విచారణకు హాజరు అవుతానని.. వారం రోజులు గడువు కావాలని సమాధానం ఇచ్చారు. అనుమానాలన్నీ ఆయన చుట్టు ముసురుకుంటున్న సమయంలో ఇలా తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేయడం .. మరింత అనుమానాస్పదంగా మారింది. నోటీసులపై ఆయన కోర్టుకెళ్లి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బ్యాంక్ లావాదేవీల వివరాలు అడిగారని కోర్టుకెళ్లారు.
మరో వైపు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజర్యాయరు. అలిపిరి వద్దనున్న సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. కల్తీ నెయ్యి కోనుగోలు వ్యవహారం పై సీట్ డీఐజీ మురళి లాంబ ఆయనను ప్రశ్నించారు. దాదాపుగా నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ తర్వాత ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ అదే సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ లడ్డులతో అక్కడికి రావడంతో.. కంగారుపడి వెళ్లిపోయారు.
కల్తీ నెయ్యి వ్యవహారం ఈవోకి తెలియకుండా ఉండదు. ధర్మారెడ్డి ఐదు సంవత్సరాల పాటు టీటీడీలో పెత్తనం చెలాయించారు. మొదట ఆయన జేఈవోగా వచ్చారు. ఈవోను కూడా పట్టించుకోకుండా అన్నీ చక్కబెట్టారు. తర్వాత ఆయనకు అర్హత లేకపోయినా ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. సాధారణంగా ఐఏఎస్లకు మాత్రమే అర్హత ఉంటుంది. కానీ ధర్మారెడ్డి రక్షణ శాఖలో ఓ ఉద్యోగి మాత్రమే. టీటీడీ ఈవోగానే రిటైరయ్యారు.


