ఏం చేస్తారు అంటే..సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. అని చెప్పుకోవడం ఓ స్టేటస్. ఇతర ఇంజినీర్లు, డాక్టర్లు, టీచర్ల కన్నా వీరిది హై లెవల్. ఇంజనీరింగ్ చదవకపోయినా ఇంజనీర్ అయ్యేలా సాఫ్ట్ వేర్ రంగం మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు వారి జీతాలు లక్షలకు చేరాయి. హై క్లాస్ జీవితాలకు అలవాటుపడ్డారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా పరిస్థితి వచ్చేసింది. ఎక్కువ జీతాలు తీసుకోవడం హక్కుగా భావించవద్దని రోడ్డున పడే రోజులు వచ్చాయని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు భవిష్యత్ చెప్పిన జోహో సీఈవో
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ జీతాలు పొందడాన్ని శాశ్వతంగా భావించవద్దని జోహో సీఈో శ్రీధర్ వెంబు హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) వంటి సాంకేతికవల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని ఆయన ప్రకటించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మెకానికల్, సివిల్ ఇంజనీర్లు, కెమిస్టులు, టీచర్ల కంటే ఎక్కువ జీతం పొందడం ఎటువంటి హక్కు కాదు. దాన్ని శాశ్వతంగా భావించకూడదు. అని హెచ్చరికలు జారీ చేశారు. AI , అడ్వాన్స్డ్ టూల్స్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉత్పాదకత విప్లవం వస్తోంది, ఇది చాలా ఉద్యోగాలను తగ్గిస్తుంది.
నిరుద్యోగులుగా మారనున్న 60 శాతం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
గత ఏడాది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు AI ప్రభావానికి గురవుతాయని తేలితింది. అధునాతన ఆర్థిక వ్యవస్థలలో ఈ ప్రభావం 60 శాతం వరకు ఉంటుందని కొత్తగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రిలియస్టులు చెబుతున్నారు. మార్పులను అర్థం చేసుకునేవారు.. దానికి తగ్గట్లుగా మార్చులు చేసుకునేవారికి భవిష్యత్ ఉంటుంది. ఇంటెల్ మాజీ సీఈవో ఆండీ గ్రోవ్ “కేవలం పారనాయిడ్లు మాత్రమే సర్వైవ్ అవుతారు ” అని విశ్లేషించారు. అది నిజమేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
భారీ జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజినీర్లను తీసేస్తున్న బడా కంపెనీలు
ఇటీవల గూగుల్, మెటా కంపెనీలు ఏఐతో కోడ్ రాసుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీ హై ఎండ్ శాలరీలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను తొలగిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపు ప్రణాళికలు ఉన్నాయని బడా బడా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదంతా ఏఐ.. అడ్వాన్సుడ్ టూర్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్లనే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రంగా జరగనుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రెడీ కావాల్సిందే. ఇప్పటి వరకూ ఆహా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్న వారు..రేపు పాపం అనే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం ఉండదు.