చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కనిపించడం లేదు. ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారు. చైనాలో ఎవరికైనా కనిపిస్తున్నారో లేదో తెలియదు కానీ.. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం కనిపించడం లేదని అంతర్జాతీయ మీడియాకు క్లారిటీ వచ్చింది. బ్రిక్స్ దేశాల సమావేశానికీ చైనా తరపున అధ్యక్షుడు హాజరు కావడం లేదు. దీంతో చైనాలో నాయకత్వ మార్పు అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ చైనాలో జరుగుతుందో లేదో కానీ.. బయట మాత్రం జోరుగా జరుగుతోంది.
చైనాలో ప్రజాస్వామ్యం లేదు. అలాగని నియంతృత్వం కూడా లేదు. ఏక పార్టీ పాలన ఉంది. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే పరిపాలిస్తుంది. మిలటరీ కూడా పేరుకు చైనా మిలటరీ అని పిలుస్తారు కానీ.. అసలు పార్టీ మిలటరీ. మొత్తం కమ్యూనిస్టు పార్టీ అధీనంలో ఉంటుంది. ఈ పార్టీ చీఫే.. దేశాధినేత. జిన్ పింగ్ కు కమ్యూనిస్టు పార్టీపై పూర్తి పట్టు ఉంది. ఎంత అంటే.. ఆయన పార్టీ రాజ్యాంగాన్ని కూడా మార్చుకుని తాను బతికున్నంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా మార్చుకున్నారు. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2018 మార్చిలో రాజ్యాంగ సవరణను ఆమోదించింది, దీని ద్వారా అధ్యక్షుడు పదవీ కాలంపై రెండు టర్మ్‌ల 10 సంవత్సరాలు పరిమితిని తొలగించారు. ఈ మార్పు జీ జిన్‌పింగ్‌కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాన్ని కల్పించింది.
ఇప్పుడు ఆయన అంత తేలికగా పదవి నుంచి దిగిపోయే అవకాశం లేదు. దింపే అవకాశం అంత కంటే లేదు. పార్టీలో అంతా ఆయన విధేయులే ఉంటారు. ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ ఉండరు. శత్రువులు అసలు ఉండరు. జిన్ పింగ్ అప్పుడప్పుడూ ఇలా అదృశ్యమవుతూ ఉంటారు. కొంత కాలం తర్వాత తిరిగి వస్తారు. ఇప్పుడు కూడా అంతే అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ జిన్ పింగ్ స్థానంలో వాంగ్ యంగ్ ను అధ్యక్షుడిగా చేస్తే.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చేస్తున్నాయి.