ఈ ప్రశ్నకు బదులేది?

రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ కు పెను ముప్పు తప్పింది. రో్డ్డు ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రమాద స్థలం నుంచి ఆయన్ని హుటాహుటిన కరీంనగర్ తరలించారు. ఆ తర్వాత రాజధానికి తరలించి యశోదా ఆస్పత్రిలో చేర్చారు. అదే ఆశ్చర్యకరం.

కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రి స్వల్ప గాయాలకు చికిత్స చేసే స్థితిలో కూడా లేదా? ప్రాణాంతక గాయాలేమీ కాలేదని మంత్రి అనుచరులే చెప్పారు. అయినా ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం లేదా? వెంటనే ఆయన్ని హైదరాబాద్ తరలించాలని అనుకున్నప్పుడు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు పనికి రాకుండా పోయాయా? పోనీ నిమ్స్ కూడా పనికి మాలిందే అనుకున్నారా? తీసుకెళ్లి యశోదా ఆస్పత్రిలో చేర్చారు. ప్రయివేటు ఆస్పత్రిలో అయితేనే చిన్న చిన్న గాయాలకు మంచి చికిత్స జరుగుతుందని నమ్మారా?

ఒక వేళ ప్రభుత్వ ఆస్పత్రులు ఇంత చిన్న గాయాలకు చికిత్స చేయలేని స్థితిలో ఉంటే అది ప్రభుత్వ వైఫల్యమే. సామాన్య జనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సర్కారు దవాఖానాకే పోవాలి. మరి అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వం ఈటెల రాజేందర్ చికిత్స విషయంలో చెప్పకనే చెప్పింది. అంటే, ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందన్నమాటే.

మరి బంగారు తెలంగాణ ఇలాగే సాధిస్తారా? ప్రజల ఆరోగ్య పరిరక్షణ అనేది బంగారు తెలంగాణ మూల సూత్రాల్లో ఒకటి కాదా? వీఐపీలు ప్రతి చిన్నదానికి కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఏసీ రూముల్లో చేరాలా? ఆ బిల్లు భారాన్ని మాత్రం ప్రజలు భరించాలా? ఆ ప్రజలు మాత్రం మందులు లేని, డాక్టర్లు సరిగా రాని సర్కారు దవాఖానాలను నమ్ముకోవాలా? తెలంగాణ ఉద్యమ సారథినని చెప్పుకొనే కేసీఆర్ కొత్త రాష్ట్రాన్ని ఈ తరహాలోనే మంచిగ చేస్తరా?

వీఐపీలు కూడా సర్కారు దవాఖానాకు పోయినప్పుడే అవి బాగుపడగాయి. ఎందుకంటే, వారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి అక్కడి సిబ్బంది ఎల్లప్పుడూ సరిగా డ్యూటీ చేసే అవకాశం ఉంటుంది. వీఐపీలు ఎట్టి పరిస్థితిలో రారు అన్నప్పుడు ఆ ఆస్పత్రుల పనితీరు మెరుగుపడే అవకాశం ఉండదు. అభివృద్ధి చెందిన, పాశ్చాత్య దేశాల్లో ప్రధాన మంత్రి, మంత్రులు కూడా సర్కారు దవాఖానాకే పోతరు. ఇంగ్లండ్ లో అయితే జ్వరం నుంచి గుండె సర్జరీ దాకా అన్నీ సర్కారు దవాఖానాల్లోనే చేస్తరు.

మన దగ్గర కనీసం జ్వరానికి మందు ఇవ్వలేని సర్కారు దవాఖానాలు కూడా ఉన్నాయి. వాటికి పట్టిన అనారోగ్యాన్ని తొలగించాలి. బంగారు తెలంగాణ అంటే రోడ్డు, ప్రాజెక్టులే కాదు. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం ఇంకా ముఖ్యం. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలగాలంటే, ముందు ప్రభుత్వంలో ఉన్నవారు వాటిని నమ్మాలి. వాటి పరిస్థితిని మెరుగు పరచాలి. అది ఎప్పుడు జరుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ...

బ్యారేజీలో బోట్లు తీయడం పెద్ద టాస్కే !

ప్రకాశం బ్యారేజీలో బోట్లు బయటకు రావడం లేదు, ఎంత మంది నిపుణులు వచ్చినా రోజుల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోజనం కలగలేదు....

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close