ఐటీకంపెనీ కీలక పదవిలో కుక్కపిల్ల!

హైదరాబాద్: ఐటీకంపెనీల ఉద్యోగుల లైఫ్ స్టైల్ ఎక్కువగా ఒత్తిడితోకూడి ఉంటుందనే విషయం తెలిసిందే. తమ ఉద్యోగులను ఈ ఒత్తిడి సమస్యనుంచి తప్పించటానికి ‘అన్ లిమిటెడ్ హైదరాబాద్‌’ అనే ఓ ఐటీ స్టార్టప్ కంపెనీ ఒక వినూత్న ప్రయోగం చేసింది. చూడగానే ముద్దులొలుకుతూ ఉండే ఒక చిన్న కుక్కపిల్లను తీసుకొచ్చి తమ ఆఫీసులో పెట్టింది. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు ఆ కుక్కపిల్లను దగ్గరకు వెళ్ళి ఆడుకుని ఒత్తిడినుంచి బయటపడతారని ఆ కంపెనీ యజమానుల ఆలోచన. మొత్తానికి ఈ ఐడియా మంచి ఫలితాన్నే ఇస్తోందట. ఒత్తిడిలోఉన్న ఉద్యోగులు రుస్తుమ్ అనే ఆ కుక్కపిల్లదగ్గరకు వెళ్ళి ఆడుకుని రీఛార్జ్ అవుతున్నారట. ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవులలాగా ఆ కంపెనీ అధినేతలు రుస్తుమ్‌కు ఛీఫ్ క్యూట్‌నెస్ ఆఫీసర్(CCO) అనే హోదాను కల్పించారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాజిటివ్ స్టెప్‌తో టీ కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ షాక్ !

కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు...

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ...

అత్యంత విష‌మంగా సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన...

ఈ వారం సినిమాలు: బాలయ్యపైనే ఆశలు

గత మూడు వారాలుగా సరైన సినిమాలేక టాలీవుడ్ బాక్సాఫీసు డీలా పడింది. అయితే ఈ వారం ఆ లోటు తీరిపోయినట్లే కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ 'అఖండ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలయ్య- బోయపాటి...

HOT NEWS

[X] Close
[X] Close