ఓటుకు నోటు కేసులో సంచలనం: గవర్నర్ పర్యవేక్షణలో దర్యాప్తు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఇవాళ కీలక మలుపు చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని దేశ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ గవర్నర్ నరసింహన్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనచట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఈ చట్టంప్రకారం హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత గవర్నర్‌దేనని, కాబట్టి ఈ కేసులో ఇరు రాష్ట్రాల పోలీసులను గవర్నర్ పిలిచి దర్యాప్తు వివరాలను అడగొచ్చని, ఆ దర్యాప్తును పర్యవేక్షించొచ్చని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. నరసింహన్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళినపుడు ఈ వ్యవహారంపై ముకుల్ రోహ్తగీని న్యాయసలహా కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com