దేశమంతటా ‘యోగా డే’ ఫీవర్!

హైదరాబాద్: రేపు తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగ పేరు మార్మోగిపోతోంది. వాడవాడలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేటు సంస్థలు ఈ కార్యక్రమాలకోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. విద్యాసంస్థలలో అయితే ఇక చెప్పనవసరంలేదు. గత కొద్దిరోజులుగా ఈ కార్యక్రమంకోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంమేరకు భారత్‌తోసహా 192 దేశాలలోకూడా ఈ యోగా డే జరగబోతోంది. ఈ నిర్ణయంవెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడి కృషి, చొరవ ఎంతో ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో ఆయన యోగాకు ఉన్న శక్తిని, ప్రాధాన్యతను నొక్కిచెబుతూ వర్తమాన ప్రపంచానికి దాని అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. ఆయన వాదనను పరిగణనలోకి తీసుకున్న ఐరాస జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.

ఐరాస నిర్ణయాన్ని, దానివెనక తమ ప్రభుత్వ కృషిని తెలియజెప్పడంకోసం ఈ కార్యక్రమాన్ని  ఘనంగా జరపాలని మోడి నిర్ణయించారు. కొద్ది ప్రాంతాలు తప్పితే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ప్రపంచ రికార్డులను తిరగరాసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఒక్క ఢిల్లీలోనే రాజ్‌పథ్‌లోనూ, ఇండియాగేట్ పరిసరాలలోనూ 37వేలమంది పాల్గొనబోతున్నారు. ఇక అంతర్జాతీయ సముద్రజలాలలో ఉన్న యుద్ధనౌకలమీద, సియాచిన్ పర్వత పాదాల చెంతనా సైనికులు ఆసనాలు వేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాలలోనూ భారత దౌత్యకార్యాలయాలు ఆయా చోట్ల ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో 30వేలమందితో జరిగే కార్యక్రమానికి సుష్మా స్వరాజ్ హాజరవుతున్నారు. కొన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రేపు వేసే ఆసనాలనుంచి సూర్యనమస్కారాలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ “రండ” రచ్చ !

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బీజేపీని కిషన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పిందని .. కానీ కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అయన...

పాజిటివ్ స్టెప్‌తో టీ కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ షాక్ !

కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు...

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ...

అత్యంత విష‌మంగా సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన...

HOT NEWS

[X] Close
[X] Close