కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్రపతి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప పర్సనాలిటీ. దేశానికి సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు కొనయాడదగ్గవి. ఆయన ఒక సైంటిస్ట్ భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టారు. ఎప్పుడూ యువత అన్నింటా ముందుండాలని కోరుకునేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం మన దేశానికే తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి – మంచు మోహన్ బాబు
దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు. ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.