నరేంద్ర మోడి బాటలో కేసీఆర్!

బంగారు తెలంగాణ స్వాప్పికుడు కె చంద్రశేఖర రావు, తానొకప్పుడు సన్నాసి అని తిట్టిని నరేంద్ర మోడీనే అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఐపాస్ గా పిలిచే పారిశ్రామిక విధాన ఆవిష్కరణ తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవడం, భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడం, విద్యుత్తు, నీటి సరఫరాకు గ్యారంటీ ఇవ్వడం… ఒకప్పుడు గుజరాత్ లో మోడీ అనుసరించిన విధానాలే.

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన తర్వాత ముందు విద్యుత్ రంగంలో విజయం సాధించారు. రెండేళ్లలోనే నిరంతర విద్యుత్ సరఫరా చేయడం మొదలుపెట్టారు. దీంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం కలిగింది. పారిశ్రామిక వేత్తలను పెద్ద ఎత్తున ఆహ్వానించారు. వైబ్రంట్ గుజరాత్ సమిట్ ద్వారా వేల కోట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్శించారు.

తెలంగాణలో కేసీఆర్ అదే బాటలో నడుస్తున్నారు. రెండు మూడేళ్లలో విద్యుత్ లో మిగులు రాష్ట్రంగా మార్చడానికి ప్లాన్ చేశారు. కొత్త ప్లాంట్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. థర్మల్ తో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. విద్యుత్ పంపిణీలోనూ విజన్ ప్రదర్శిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ రాకపోయినా ఇబ్బంది లేని విధంగా విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలే అమలు చేయడానికి సంకల్పించారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తమైన బ్రాండ్ హైదరాబాద్ ఇమేజిని వీలైనంత క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన ఎత్తుగడ. నిర్ణీత కాల వ్యవధిలో సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు రెండు వారాల్లో లైసెన్సులు ఇస్తామనడం పారిశ్రామిక వేత్తలను బాగా ఆకర్షించే విషయాలు.

దేశంలో మొదటి నుంచీ పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందిన ముంబై ప్రత్యేకతలు వేరు. ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టేవారు ముంబైకి మించి ఆలోచిస్తున్నారు. అందుకే, హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ ఈ రేసులో పోటీ పడుతున్నాయి. మిగతా నగరాలకంటే హైదరాబాద్ కు కొన్ని అనుకూలాంశాలున్నాయి. బ్రాండ్ హైదరాబాద్ వీటిలో ఒకటి. అపారమైన భూమి మరో అంశం.

నిజాం నవాబులకు చెందిన వేల ఎకరాల మిగులు భూములు ప్రభుత్వ పరమయ్యాయి. కాబట్టి, హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టే వారికి కావాల్సినంత భూమిని కేటాయిస్తామని కేసీఆర్ తన పారిశ్రామిక విధానంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో మరే నగరానికీ ఈ అవకాశం లేదు. వేరే నగరాల్లో భూమిని కొనుక్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఇది రెడీమేడ్ లాంటిది. సరిగ్గా ఈ ప్లస్ పాయింటునే క్యాష్ చేసుకుంటే లక్షల కోట్ల పెట్టుబడులతో వేలాది పరిశ్రమలను రాబట్టే వీలుంది. అయితే కేసీఆర్ హామీ ఇచ్చినట్టు, అవినీతి రహిత విధానాలు, ఇబ్బంది కలిగించని విధంగా అనుమతులు నిజమైతేనే తెలంగాణ పారిశ్రామికంగా ముంబైతో పోటీ పడుతుంది.

అవినీతి గానీ పారిశ్రామిక వేత్తలను ఇబ్బంది పెట్టే వాతావరణం గానీ కనిపిస్తే మాత్రం బ్రాండ్ హైదరాబాద్ కూడా తెలంగాణను కాపాడలేక పోవచ్చు. ఈ విషయంలో కేసీఆర్ జాగ్రత్త వహించాల

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్తగా రాజ్యాంగ హత్యా దినం

మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. కానీ కేంద్రం కొత్తగా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని కూడా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ విడదల చేసి వాటిని ఘనంగా ప్రకటించుకున్నారు మోదీ, అమిత్...

వైసీపీ ఇంకా మారదా?

వైసీపీ ఇంకా మారడం లేదు. అప్పుడూ, ఇప్పుడూ తప్పుడు ప్రచారమే ఎజెండాగా రాజకీయం చేస్తోంది. అసత్యాలు, అర్దసత్యాలే పార్టీ ఎదుగుదలకు సోపానాలుగా పాలిటిక్స్ చేస్తోంది. ఇటీవలే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు...

షర్మిలను ఢీకొట్టే జగన్ బాణం ఎవరు?

వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను జగన్ రెడ్డి తూతూమంత్రంగా నిర్వహించారని.. సొంత తండ్రి జయంతి వేడుకలను నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ.. జగన్ రెడ్డిని షర్మిల గట్టిగానే వాయించేశారు. ఎన్నికల సమయంలో ఒక్కో...

పుంగ‌నూరులో పెద్దిరెడ్డిపై తిరుగుబాటు…

చిత్తూరు జిల్లాలో చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిన‌ట్లుంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులో... త‌న సొంత క్యాడ‌ర్ తిర‌గ‌బ‌డుతున్నారు. ఇటీవ‌లే పెద్దిరెడ్డిని కాద‌ని, పుంగ‌నూరు మున్సిప‌ల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close