సెల్‌‍టవర్‌పై ఆందోళన చేస్తూ రైతు మృతి

హైదరాబాద్: ప్రభుత్వాధికారి అవినీతి ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కడపజిల్లా నందలూరులో పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు రు.4 లక్షలు అడిగిన తహసీల్దార్‌కు నిరసన తెలపటంకోసం సయ్యద్ మక్బూల్ బాషా అనే రైతు సెల్‌టవర్ ఎక్కాడు. అయితే గుండెపోటు రావటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుడు నాగిరెడ్డిపల్లెవాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నందలూరు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆర్డీవోను ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూ. 117 కోట్ల ఏపీ సీఎంఆర్ఎఫ్‌ సొమ్ముకు నకిలీ చెక్కులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఏకంగా రూ. 117 కోట్లను కొట్టేయడానికి వేసిన ఓ ప్లాన్ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న...

ఆ బిల్లులు రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే పాస్..!

వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వ చిక్కులలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఊహించుకున్నాయి కానీ... బీజేపీ పెద్దలు అంత కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓటింగ్ అవసరం లేకుండా.. మూజువాణి ఓటుతో ఆమోదించేసినట్లుగా...

నాగ అశ్విన్ పరిస్థితేంటి?

'మ‌హాన‌టి' త‌ర‌వాత‌... మ‌రో సినిమా మొద‌లెట్ట‌లేదు నాగ అశ్విన్‌. ప్ర‌భాస్ తో ఓ సినిమా ఓకే చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వైజ‌యంతీ మూవీస్ లో దాదాపు 300 కోట్ల‌తో ఈ సినిమా...

షరతుల్లేకుండానే రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు..!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో.. వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. ఎన్డీఏ పక్షంలోని పార్టీలే ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న సమయంలో.. వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close