నీటి ప్రాజెక్టులపై అగ్గి రాజేసిన హరీష్‌రావు

నీటిపారుదల ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణ మధ్య మాటలయుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలను సంధించారు. తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోలేని బాబు, ప్రజల దృష్టిని మళ్లించడానికే తెలంగాణ ప్రాజెక్టులపై పదే పదే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.

పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ రాశారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టులూ కొత్తవి కావని, ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయంటూ హరీష్ రావు అనేక ఆధారాలు చూపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జారీ చేసిన జీవోలను ఉదహరించారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ కేంద్రం నుంచి పెద్దగా సహాయం పొందలేకపోతోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది రాలేదు. వస్తుందనే ఆశకూడా లేదు. కాబట్టి, ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్తున్నారనేది హరీష్ రావు వాదన. ఏపీ కోసం ఏమైనా చేస్తానని తన రాష్ట్ర ప్రజలకు ఓ సందేశం ఇవ్వడం ద్వారా, ప్రత్యేక హోదా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాబు యత్నిస్తున్నారనేది హరీష్ రావు ఆరోపణల సారాంశం. ఈ రెండు ప్రాజెక్టులపైనా మొదటి నుంచీ ఏపీ అభ్యంతరం చెప్తూనే ఉంది. తెలంగాణ మాత్రం ఇది తమ హక్కు అని వాదిస్తోంది. ఈ పంచాయితీ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా హరీష్ రావు చేసిన ఆరోపణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందన ఎలా ఉంటుందో గానీ ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా సామరస్య వాతావరణం నెలకొనక పోవడం దురదృష్టకరం అంటున్నారు పరిశీలకులు.

అనుమతులు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, అనుమతులు లేని వాటిపై వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధిలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడంలో పోటీ పడుతున్నాయి. తమతమ ప్రజల దృష్టిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీగా ముద్ర పడటం కోసం వివాదాన్ని రాజేస్తున్నాయనే విమర్శలుకూడా వినవస్తున్నాయి. హరీష్ రావు చెప్పినట్టు అవి అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులా కావా అనేది ఏపీ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా అభ్యంతరం ఉంటే కూర్చుని చర్చించుకోవచ్చు కదా అనే పరిశీలకుల మాటను ఇరు రాష్ట్రాలూ పాటిస్తాయో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close