పెళ్లి చేసుకోవ‌డానికి తొంద‌రేం ప‌డ‌డం లేదు – సాయిధ‌ర‌మ్ తేజ్ తో ఇంట‌ర్వ్యూ

గ‌తేడాది ‘విరూపాక్ష’ తో ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ‘బ్రో’లో త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి న‌టించిన సంతృప్తి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు ప్ర‌మాదం నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్య‌వంతుడ‌య్యాడు. 2024లో అత‌న్నుంచి ‘గంజా శంక‌ర్‌’ రాబోతోంది. ‘స‌త్య‌’ అనే ఓ ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ లో న‌టించాడు. ఈ సంద‌ర్భంగా సాయిధ‌ర‌మ్ తేజ్‌తో తెలుగు 360 ప్ర‌త్యేకంగా సంభాషించింది.

* హాయ్ అండీ.. ఇప్పుడు ఎలా ఉన్నారు? పూర్తిగా కోలుకొన్న‌ట్టేనా?
– ఆ దేవుడి ద‌య‌, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సుల వ‌ల్ల బాగానే ఉన్నాడు. డిసెంబ‌రులో మ‌రో చిన్న స‌ర్జ‌రీ జ‌రిగింది. దాంతో పూర్తిగా కోలుకొన్నాను. ఇక‌పై ఎప్ప‌టిలానే సినిమాల‌పై దృష్టి పెట్టాలి.

* ఇదివ‌ర‌క‌టి కంటే చాలా కూల్‌గా… కామ్ గా క‌నిపిస్తున్నారు. ఫిలాస‌ఫీ మాట్లాడుతున్నారు. కార‌ణం ఏమిటి?
– చావు అంచుల వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చాను. బ‌హుశా అందుక‌నేనేమో? నేను అంత‌కు ముందు నుంచీ కూల్‌.. అండ్ కామ్‌నే. యాక్సిడెంట్ త‌ర‌వాత అది మ‌రింత ఎక్కువ అయిన‌ట్టు ఉంది. నేను చేస్తోంది స‌రిపోవ‌డం లేదు, ఇంకొంచె చేయ‌మ‌ని భ‌గ‌వంతుడు ఇచ్చిన ఎగ‌స్ట్రా టైమ్ ఇది అనుకొంటున్నా.

* ‘గాంజా’ శంక‌ర్ ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది?
– వ‌ర్క్ జ‌రుగుతోంది. సినిమాల విష‌యంలో కంగారు ప‌డ‌డం లేదు. స్క్రిప్టు విష‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకొంటున్నాను. ఒక‌సారి సినిమా ప‌ట్టాలెక్కిన త‌ర‌వాత‌.. ఇక ఆగ‌దు. సూప‌ర్ స్పీడులో వ‌ర్క్ జ‌రిగిపోతుంది.

* కొత్త క‌థ‌లేమైనా విన్నారా?
– విన్నానండీ. కానీ ఏదీ కుద‌ర్లేదు. కొన్ని క‌థ‌లపై ఇంకాస్త వ‌ర్క్ చేయాల‌ని అనిపించింది. అందుకే కొత్త సినిమాలేం ఒప్పుకోవ‌డం లేదు. ఓటీటీలు వ‌చ్చిన త‌ర‌వాత‌.. వ‌ర‌ల్డ్ సినిమా మ‌న‌కు అందుబాటులోకి వచ్చేసింది. మ‌నం కూడా క్వాలిటీ ప్రొడ‌క్ట్ ఇవ్వాల్సిందే.

* ఈ యేడాదైనా పెళ్లి క‌బురు వినిపిస్తారా?
– పెళ్లి విష‌యంలో తొంద‌ర‌లేదండీ. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను క‌దా? ఇంటికొస్తే.. ‘లేట్ గా ఎందుకు వ‌చ్చావ్‌’ అనేవాళ్లు ఉండ‌రు. ఎక్క‌డికి వెళ్తున్నావ్ అని ఎవ‌రూ అడ‌గ‌రు. బెడ్ అంతా నా ఒక్క‌డిదే. నా కాఫీ నేను పెట్టుకొంటా. నా టీ నేను తాగుతా..(న‌వ్వుతూ)

* సోలో లైఫే బెట‌రంటారు..
– (న‌వ్వుతూ) అంతేగా..! పెళ్లి చేసుకోను అని కాదు.. చేసుకొంటా. కానీ దానికి తొంద‌ర ప‌డ‌డం లేదు. అంతే.

* పుస్త‌కాలంటే చాలా ఇష్ట‌మ‌ట‌.. ఈమ‌ధ్య చ‌దివిన పుస్తకం ఏది?
– `ద ప‌వ‌ర్ ఆఫ్ నౌ` అనే పుస్త‌కం నాలో బాగా స్ఫూర్తి ఇచ్చింది.

* ఫ‌లానా పుస్త‌కం చ‌దివితే బాగుంటుంది అని ఎవ‌రికైనా స‌ల‌హాలు ఇస్తారా?
– లేదండీ. ఎవ‌రి ఇష్టం వాళ్ల‌ది. నా అభిరుచులు వేరు.. వాళ్ల అభిరుచులు వేరు కావొచ్చు. అందుకే పుస్త‌కాల విష‌యంలో ఎలాంటి సల‌హా ఇవ్వ‌రు. ఎవ‌రైనా ఇస్తే మాత్రం తీసుకొంటా.

* `బ్రో` కోసం త్రివిక్రమ్ తో క‌లిసి ప‌ని చేశారు. ఆయ‌నేమైనా పుస్త‌కాల గురించి స‌ల‌హాలు ఇచ్చారా?
– ఆయ‌న సెట్ కి వ‌చ్చిందే చాలా తక్కువ‌. మ‌హా అయితే ఈ సినిమా విష‌యంలో మేం మూడు సార్లు క‌లిసి ఉంటాం. అంతే. మామ‌ధ్య పుస్త‌కాల ప్ర‌స్తావ‌న ఏం రాలేదు.

* మ‌ధ్య‌లో ‘స‌త్య‌’ అనే ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. కార‌ణం ఏమిటి?
– రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి అది నా స్నేహితుడి కోసం చేశాను. ఇంకోటి దేశం కోసం. ఓ మంచి పాయింట్ ని జ‌నంలోకి తీసుకెళ్లాల‌న్న‌ది నా ఆలోచ‌న‌. అందుకే షార్ట్ ఫిల్మ్ అని చూడ‌లేదు. పైగా నా స్నేహితుడు న‌వీన్ ప్ర‌తిభ నాకు తెలుసు. అది ఈ ప్ర‌పంచానికి తెలియాల‌న్న‌ది స్నేహితుడిగా నా స్వార్థం. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ చేశా. ఈనెల‌లోనే విడుద‌ల చేస్తున్నాం.

* ఓకే అండీ.. ఆల్ ద బెస్ట్‌
– థ్యాంక్స్ ఎలాట్ అండీ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భీమా’ ట్రైలర్ టాక్ : బ్రహ్మ రాక్షసుడు

https://www.youtube.com/watch?v=P3t--CmbibE మార్చిలో వస్తున్న సినిమాల్లో గోపీచంద్‌ 'భీమా' ఒకటి. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ అంతా యాక్షన్, ఎలివేషన్స్ తో నిండిపోయింది. ట్రైలర్ లో...

జనసేనను రెచ్చగొట్టే ప్లాన్ ఫెయిలయిందని వైసీపీ గగ్గోలు !

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని.. పొత్తు కుదిరినా రెండు పార్టీల సీట్ల పంచాయతీ పెట్టాలని చాలా కాలంగా వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. సీట్ల సర్దుబాటు .. అభ్యర్థుల ప్రకటన...

ఇలాగైతే ర‌ధ‌న్‌కి క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో ప్ర‌తిభావంతులైన సంగీత ద‌ర్శ‌కుల‌కు కొద‌వ లేదు. కీర‌వాణి, త‌మ‌న్‌, దేవిశ్రీ‌ల‌తో పాటు భీమ్స్, మిక్కీ జే మేయ‌ర్ లాంటివాళ్లు అందుబాటులో ఉన్నారు. ర‌ధ‌న్ పేరు కూడా బాగా పాపుల‌ర్‌. చిన్న‌,...

ఫస్ట్ లిస్ట్ : టీడీపీ – జనసేన యుద్ధానికి సిద్ధం !

సిద్ధం సిద్ధం అని జగన్ రెడ్డి అరుస్తూనే ఉన్నారు. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు. ఒక జాబితాలో ఉన్న వారి పేరు మరో జాబితాలో మార్చేస్తున్నారు. ఒక్క ఎంపీ అభ్యర్థి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close