స్వరాజ్య సమరంలో చిరస్మరణీయ ఘట్టాలు

స్వాతంత్ర్య దినోత్సవం. బానిస బతుకులకు, చీకటి బతుకులకు విముక్తి లభించిన రోజు. ఈ రోజు కోసం లక్షల మంది ఉద్యమించారు. వేల మంది బలిదానం చేశారు. భగత్ సింగ్ వంటి వారు ఏరికోరి ఉరికొయ్యను ముద్దాడారు. గాంధీజీ అహింసా మార్గంలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. నేతాజీ సైన్యంతో తెల్లవాడిపై దండెత్తారు. మన దేశ స్వాతంత్ర్య పోరాటం, ప్రపంచ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం.

శాంతి పరిఢవిల్లే దేశంగా, అపారమైన సహజ వనరులున్న సుసంపన్న దేశంగా భారత్ ఎన్నో దేశాల వారి దృష్టిని ఆకర్షించింది. మొగలుల తర్వాత ఐరోపా వారు క్రమంగా మన దేశంలోకి చొరబడ్డారు. అందరికన్నా ముందు, పోర్చుగీసు వారు 1434లో మన దేశంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1605లో డచ్ వారు ప్రవేశించారు. అనంతరం ఈస్టిండియా కంపెనీ పేరుతో ఇంగ్లండ్ వారు 1612లో కాలుమోపారు. ఫ్రెంచి వారు 1729లో చొరబడ్డారు.

ప్లాసీ యుద్ధంలో విజయంతో మన దేశంలో ఆంగ్లేయుల పాలన సుస్థిరమైంది. బెంగాల్ నవాబుకు, ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన యుద్ధం అది. కలకత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో, భాగీరథీ నది ఒడ్డున పాలాసి అనే చోట ఈ యుద్ధం జరిగింది. బెంగాల్ నవాబుకు ఫ్రెంచి సైన్యం కూడా అండగా నిలిచింది. ఆంగ్లేయులు తమ కుట్రలను అమలు చేయడం ద్వారా విజయం సాధించారు. నవాబు ఓడించడానికి సహకరిస్తే నిన్నే నవాబును చేస్తామంటూ అతగి సేనాని సిరాజుద్దౌలాకు రాబర్ట్ క్టైవ్ హామీ ఇచ్చాడు. అలా అతడి సహకారంతో ఈస్టిండియా కంపెనీ 1757 జూన్ 23న విజయం సాధించింది.

అలా మొదట బెంగాల్లో, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఆంగ్లేయుల పాలనకు మార్గం సుగమమైంది. తర్వాతి కాలంలో ఈస్టిండియా కంపెనీకి బదులు బ్రిటన్ ప్రభుత్వం ఇండియాను పాలించింది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలు, 1947 వరకూ ఎంతో మంది పోరాటంలోపాల్గొన్నారు. ఎన్నో నినాదాలు ఇచ్చారు. వారిపై అభిమానంతో బిరుదుల్లాంటి పేర్లతో పిలుచుకున్నారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించిన తిలక్ ను లోకమాన్యగా సంబోధించారు. బంకించంద్ర ఛటర్జీ నినాదం వందే మాతరం… ఉద్యమకారులకు స్ఫూర్తి మంత్రంగా మారింది. విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ మొదట గాంధీజీని మొదట మహాత్మా అని సంబోధించారు. అలా మహాత్మా గాంధీ అయ్యారు. గాంధీజీ డూ ఆర్ డై అనే పిలుపునిచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్ జైహింద్ అని పిలుపునిచ్చారు. ఆయన్ని నేతాజీ అని అభిమానులు పిలుచుకున్నారు. లాలా లజపతి రాయ్ ను పంజాబ్ కేసరి అని పిలిచే వారు. ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు.

రెండో ప్రపంచ యుద్ధంతో ఇంగ్లండ్ ఆర్థికంగా, సైనికంగా చాలా బలహీనపడింది. వలస దేశాలను తన కంట్రోల్ లో ఉంచుకునే శక్తి తగ్గిపోయింది. ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావంతో బ్రిటన్ సైన్యంలోని భారతీయ సిపాయిలు ఎప్పుడు తిరగబడతారో తెలియని పరిస్థితి ఉండేది. మరోవైపు, గాంధీజీ నాయకత్వంలో అహింసా మార్గంలో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ సమయంలో మనకు స్వాతంత్ర్యం లభించింది. పోతూ పోతూ భారత్, పాకిస్తాన్ గా రెండు ముక్కలు చేశారు ఇంగ్లండ్ పాలకులు.

దేశ విభజన తర్వాత కొత్త దేశం పాకిస్తాన్ కు 75 కోట్ల రూపాయలను భారత దేశం ఇవ్వాలని ఆనాడు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ సూచించింది. మొదటి విడతగా మన దేశం 20 కోట్లు ఇచ్చింది. ఇంతలో పాకిస్తాన్ మన మీద మొదటి యుద్ధం ప్రకటించడంతో ఆ డబ్బు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధపడలేదు. పాకిస్తాన్ కూడా అడగలేదు.

స్వాతంత్ర్య వచ్చిన మూడు నెలలకే కాశ్మీర్లో పాకిస్తాన్ మనతో మొదటి యుద్ధానికి దిగింది. అది అలా చేయకపోయి ఉంటే ఆనాడు కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ కే ఇచ్చే అవకాశం ఉండేదని అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ అధికారిక పత్రాల్లో రాశారు. ఆ డాక్యుమెంట్ ఇప్పటికీ రాష్ట్రపతి భవన్లో ఉంది. అంటే పాక్ చేజేతులా కాశ్మీర్ ను చేజార్చుకుంది.

ఒకప్పుడు మన కరెన్సీ బలంగా ఉండేది. స్వాతంత్ర్యం పొందిన నాడు మన 1 రూపాయి, 1 అమెరికా డాలర్ తో సమానం. ఇప్పుడు 60 రూపాయలు దాటింది. స్వాతంత్ర్య పొందే నాటికి మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర 88 రూపాయలు.

కాలక్రమంలో మన దేశం ఆర్థికంగా బలపడటానికి బదులు బలహీన పడింది. ఒక డాలర్ కొనాలంటే 60 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిన స్థితికి చేరుకుంది. అవినీతి భూతం భారత దేశానికి శాపంగా మారడమే దీనికి కారణం. అందుకే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంత కాలం నిరంకుశ పాలన ఉంటేనే స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా ఉంటుందని నేతాజీ భావించారు. కానీ అలా జరగలేదు. ఎప్పటికైనా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆశిద్దాం.

జై హింద్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close